తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సంచలన విషయాల్ని వెల్లడించారు. నమ్మశక్యంగా లేని రీతిలో ఉన్న ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అవునా? అలా సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా ఉన్న ఆయన మాటల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మొత్తంగా మారిపోనుందన్నారు.
అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఏడెనిమిది మంది మంత్రులు.. 15 మంది ఎమ్మెల్యేల వరకూ తమకు టచ్ లో ఉన్నారని చెప్పారు. సరైన సమయంలో వారు తమ చెంతకు వస్తారని చెప్పిన ఆయన.. పలువురు టీడీపీ నేతలు కూడా తమ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.
ఏదో మాటకు చెప్పామంటే చెప్పామన్నట్లు కాకుండా తమతో టచ్ లో ఉన్న నేతలకు సంబంధించిన అర్థమయ్యి.. అర్థం కాని రీతిలో కొన్ని వివరాల్ని వెల్లడించారు. పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే తమతో టచ్ లో ఉన్నారన్న భట్టి.. టీఆర్ ఎస్.. టీడీపీలకు చెందిన అన్ని స్థాయిల నేతలు అన్ని జిల్లాల నుంచి రానున్నట్లు చెబుతున్నారు.
టీఆర్ ఎస్ లోని నేతలు కేసీఆర్ నియంతృత్వాన్ని భరించలేకపోతున్నారన్నారు. కేసీఆర్ తీరుతో విసిగిపోయిన వారు తమ పార్టీలోకి రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లోనూ వ్యతిరేకత బలంగా ఉందని.. క్షేత్ర స్థాయిలో తిరుగుతున్న అధికారపక్ష నేతలు ఈ విషయాల్ని గుర్తించారన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొన్ని విషయాల్ని బయటకు వెల్లడించటానికి ఇష్టపడని అంశాల్ని భట్టి వెల్లడించారు. తమ పార్టీలో నుంచి టీఆర్ ఎస్ లోకి వెళ్లిన కొందరు కోవర్టులుగా పని చేస్తున్నారని.. పలుఅంశాలకు సంబంధించి సమాచారాన్ని అందిస్తున్నట్లుగా చెబుతున్న తీరు చూస్తే.. గులాబీ బ్యాచ్ ను కన్ఫ్యూజన్ కు గురి చేసేటట్లుగా ఉన్నాయన్న భావన కలగటం ఖాయం.
వెనక్కి వచ్చే వారిని తీసుకునే విషయంలో అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుదని చెప్పారు భట్టి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి.. జరగబోయే పరిణామాల్ని మాత్రమే తాను వివరిస్తున్నట్లుగా చెప్పిన భట్టి.. మంత్రుల్లో ఎవరెవరు వచ్చే అవకాశం ఉందన్న వివరాల్ని మాత్రం తనను అడగొద్దని ఆయన చెప్పారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. రైతుల సమస్యలు.. రైతులకు బేడీలు.. ప్రాజెక్టు రీడిజైనింగ్.. మిషన్ కాకతీయ.. మిషన్ భగీరధ.. మియాపూర్ భూములు.. నేరెళ్ల ఘటన లాంటి అంశాలతో తమ పార్టీ ప్రజల్లోకి వెళ్లనున్నట్లుగా చెప్పారు.