రిజర్వేషన్ల లొల్లి.. బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన

Update: 2019-01-10 09:02 GMT
అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ఆమోదించింది. దీనిపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.తాజాగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అగ్రవర్ణాలు 9శాతమే ఉన్నారని.. వారికి 10శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 1000మందితో బషీర్ బాగ్ మెయిన్ రోడ్డు నుంచి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలుపుతామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. అడగని వారికి రిజర్వేషన్లు కల్పించడమేంటని కృష్ణయ్య నిలదీశారు.

దేశంలోని పదవులన్నీ 80శాతం అగ్రకులాలకు చెందిన వారి చేతిలోనే ఉన్నాయని.. అలాంటి వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏంటని ఆర్.కృష్ణయ్య నిలదీశారు. బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ముప్పై మంది ముఖ్యమంత్రులుగా చేస్తే అందరూ బీసీలు లేరని.. అంతా అగ్రకులాలేనని.. అలాంటి వారికి రిజర్వేషన్లు కల్పిస్తారా అని ప్రశ్నించారు.


Full View

Tags:    

Similar News