రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..!

Update: 2022-12-30 11:53 GMT
యువ క్రికెటర్ రిషబ్ పంత్ నేటి ఉదయం యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఢిల్లి నుంచి రూర్కీ వెళ్తున్న క్రమంలోనే ఢిల్లీ డెహ్రడూన్ జాతీయ రహదారిపై రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ ఘటనలో రిషత్ పంత్ కు గాయాలు కాగా స్థానికులు వెంటనే అతడిని డెహ్రడూన్ ఆస్పత్రికి తరలించారు. దీంతో రిషబ్ పంత్ పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలోనే పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కీలక ప్రకటనను విడుదల చేసింది. కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కు నుదురు చిట్లిందని.. వీపుపై కాలిన గాయాలు.. కుడి కాలిపై లిగ్మెంట్ పక్కకు జరిగినట్లు ఎక్స్ రేలో వెల్లడైందని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ఇతర స్కాన్ ల కోసం ట్రీట్మెంట్ జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.

పంత్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడానని.. వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు జై షా తెలిపారు. రిషబ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. అతడికి ఏ సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని జై షా ట్వీట్ చేశారు. అదేవిధంగా రిషబ్ పంత్ కారు ప్రమాద సంఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. పంత్ కు అయ్యే వైద్య ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు పంత్ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ మాట్లాడారు. కారు ప్రమాదంలో పంత్ కు చిన్నపాటి గాయాలే తగలాయని.. ప్రాణాపాయం ఏమిలేదని తేల్చి చెప్పారు. నడుము భాగంలో తగిలిన గాయాలకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా రిషబ్ పంత్ కారు నడుపుతున్న సమయంలో అందులో అతనొక్కడే ఉన్నాడని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.

వాహనంపై నియంత్రణ కోల్పోవడం తోనే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిందని తెలిపారు. ఈ సమయంలో వాహనంలో మంటలు చెలరేగినట్లు డీజీపీ తెలిపారు. ఏది ఏమైనా పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలియడం క్రికెట్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి రిషబ్ పంత్ తప్పించుకున్నాడని.. త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News