గుండెపోటుతో కోల్ కతాలోని ఉడ్ లాండ్స్ ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించినట్టు పేర్కొన్నారు.ఉదయం ఎక్సర్ సైజులు చేస్తుండగా ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రిలో గంగూలీ చేరాడు. ఈ క్రమంలోనే ఆయన గుండెలో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి ఆస్పత్రి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు.
గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ ను వైద్యులు వేశారు. ఇంకా ఆయన గుండెలో మరో రెండు బ్లాక్స్ ఉన్నాయని.. వీటికి చికిత్స అందిస్తున్నామన్నాని వైద్యులు తెలిపారు. ఆది, సోమవారాల్లో మరో రెండు స్టంట్లు గంగూలీ గుండెకు వేయనున్నారు.
గంగూలీ వచ్చే 48 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉంటారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. గంగూలీకి చికిత్స నిమిత్తం ముగ్గురు డాక్టర్లతో ఒక టీంను ఏర్పాటు చేసినట్లు కూడా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గంగూలీకి గుండెపోటు.. ఆపరేషన్ జరిగిందన్న వార్త తెలియగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.