ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పొట్టి ఫార్మాట్ క్రికెట్ లోకి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల కన్నా లేటుగా అడుగుపెట్టిన భారత్....ఐపీఎల్ తో లేటెస్ట్ క్రేజ్ ను సంపాదించింది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా బిగ్ బాష్ వంటి టీ20 లీగ్ లకు అందనంత ఎత్తుకు ఐపీఎల్ ఎదిగింది. ఐపీఎల్ సక్సెస్ రేట్ , ఆదాయం, క్రేజ్....మరే దేశం నిర్వహించే టీ20 క్రికెట్ టోర్నీకి లేవంటే అతిశయోక్తి కాదు.
అందుకే, ఐపీఎల్ లో ఆడి తమ సత్తా చాటేందుకు అన్ని దేశాల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక, వేల కోట్ల ఆదాయం కుమ్మరించే ఐపీఎల్ జట్టును సొంతం చేసుకునేందుకు కూడా బడా బడా కార్పొరేట్ కంపెనీలు కూడా ఆటగాళ్లకంటే ఎక్కువగా పోటీపడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రెండు కొత్త టీంల కోసం టెండర్లను బీసీసీఐ ఆహ్వానించింది. ఈ టెండర్ల ప్రక్రియం నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ షాకిచ్చింది.
ప్రస్తుతం ఐపీఎల్-2021లో 8 జట్లు పాల్గొనగా....ఐపీఎల్- 2022ను 10 జట్లతో నిర్వహించాలని భావించింది. అందుకుగాను రెండు కొత్త టీంల కోసం టెండర్లు పిలిచింది. అయితే, ఈ టెండర్లలో పలు కంపెనీలతో పాటు ధోనీ ప్రమోటర్ గా ఉన్న రిథి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కూడా వేలంలో పాల్గొంది. టెక్నికల్ బిడ్ లో అర్హత సాధించిన రీతి స్పోర్ట్స్...కమర్షియల్ బిడ్ దాఖలు చేయడంలో విఫలమైంది. అందుకు, ఆ సంస్థ మేనేజ్ మెంట్ డైరెక్టర్ అరుణ్ పాండే ఆలస్యంగా టెండర్ల కార్యక్రమానికి హాజరు కావడమే అని తెలుస్తోంది.
లక్నో జట్టును దక్కించుకోవడానికి ఆ సంస్థ ప్రయత్నించింది. నిర్ణీత సమయానికి కాస్త ఆలస్యంగా పాండే రావడంతో బీసీసీఐ అధికారులు, న్యాయ నిపుణులు రిథి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ టెండర్ ను నిరాకరించాని తెలుస్తోంది. దీంతో, పాండే టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండానే వెనుదిరిగారట. కొంత ఆలస్యంగా వచ్చిన కారణంతో ధోనీకి బీసీసీఐ షాకిచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్స్, లక్నో జట్టును ఆర్పీ- సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్కించుకున్నాయి.