ఆ దేశాల్లో కరోనా ని అరికట్టడం అంత ఈజీ కాదా?

Update: 2020-04-08 15:00 GMT
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో మానవాళి ప్రపంచం వణుకుతోంది. ప్రపంచం ప్రమాదంలో పడింది. ఈ కరోనా నివారణకు అందుబాటులో ఉన్న మందులతో వైద్యం అందిస్తున్నారు. కరోనాకు మందు లేకపోవడంతో మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సి క్లోరోక్విన్‌ మందును వినియోగిస్తున్నారు. అయితే కరోనా వ్యాపించకుండా ఒక టీకా అడ్డుకుంటోందని పలు పరిశోధనల్లో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో కరోనాకు అడ్డుకట్ట వేసేలా ఓ తాజా పరిశోధన మానవ ప్రపంచానికి ఆశలు రేకెత్తుతున్నాయి. కరోనా నివారణకు విరుగుడు కనిపెట్టడంలో ముందడుగు పడిందని సమాచారం. అదే క్షయ వ్యాధి నివారణలో కీలకంగా పనిచేసే బాసిల్ కాల్మెట్-గురిన్ (బీసీజీ) వ్యాక్సిన్‌. ఈ బీసీజీ వ్యాక్సిన్‌ కరోనా సోకిన వారు కోలుకునేందుకు అద్భుతంగా పని చేస్తున్నట్టు ప్రపంచ వైద్య నిపుణులు - పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొందరు వైద్య నిపుణులు ‘కరోనా ఇన్‌ ఫెక‌్షన్‌- బీసీజీ వ్యాక్సినేషన్‌ దేశాల్లో పరిస్థితి’ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో తాజాగా పురోగతి కనిపించిందని సమాచారం. అయితే ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన కేసుల్లో బీసీజీ వ్యాక్సినేషన్‌ జరిగిన దేశాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉందని ఆ పరిశోధనలో వెల్లడైంది. దీంతో పాటు కరోనా వైరస్‌ సోకిన బాధితుల్లో శ్వాస సంబంధ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు బీసీజీ టీకా రోగ నిరోధక శక్తి పెంచుతోందా అనే దానిపై కూడా ఆ వైద్యులు పరిశోధనలు చేస్తున్నారంట. అదే వాస్తవమైతే భారతదేశంలో కరోనా వైరస్‌ కు ముకుతాడు పడే అవకాశం ఉంది. ఆ బీసీజీ వ్యాక్సిన్‌ ను ఉపయోగించి కరోనాకు మందు కనిపెట్టేందుకు సులువవుతుంది.

వాస్తవంగా క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాను 1920లో ప్రవేశపెట్టారు. అప్పట్లో ప్రపంచ పటంలోనే అత్యధికంగా భారతదేశంలో క్షయ బారినపడ్డారు. దీంతో 1948లో బీసీజీ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బీసీజీ టీకా వేయడంతో క్షయ వ్యాధిగ్రస్తులు కోలుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత క్షయ అనే పేరు భారత్‌ లో ప్రస్తుతం వినిపించడం లేదు. బీసీజీ వ్యాక్సినేషన్‌ అందిస్తున్న దేశాల్లో హ్యూస్టన్‌ లోని యూరలోజిక్‌ అంకోలజీ అండ్‌ క్యాన్సర్‌ రీసర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ ఆశిష్‌ కామత్‌ కరోనా మృతులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని - మృతుల రేటు ఒక మిలియన్‌ కు 4.28 ఉందని పేర్కొన్నారు. అయితే ఈ బీసీజీ వ్యాక్సినేషన్‌ వేయని దేశాల్లో మరణాల రేటు ఒక మిలియన్‌ కు 40గా ఉందని వారు చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే బీసీజీ వేయని దేశాలు అమెరికా - ఇటలీ - నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో కరోనా విజృంభిస్తూ ఆ దేశాలు తీవ్రంగా సతమతమవుతున్న విషయం తెలిసిందే. బీసీజీ వ్యాక్సినేషన్‌ ఎప్పటినుంచో అమలులో ఉన్న భారతదేశానికి ఇప్పుడు కరోనాకు అడ్డుకట్టగా  నిలిచింది.


Tags:    

Similar News