కరోనా లాగే ఒకప్పడు టీబీ (క్షయ) మహమ్మారి కూడా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. టీబీ సోకి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడక్కడా కొంతమంది టీబీ బారినపడుతున్నారు. ప్రస్తుతం టీబీకి కచ్చితమైన చికిత్సతో పాటు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. అయితే టీబీ నివారణ కోసం ఇచ్చే బీసీజీ టీకా.. కోవిడ్ -19 నుంచి కూడా కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. 1920ల్లో అభివృద్ధి చేసిన బీసీజీ వ్యాక్సిన్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ విషయంపై బ్రిటన్‌లో పరిశోధనలు కూడా సాగుతున్నాయి. యూనివర్సిటీ ఎక్స్‌టెర్ దాదాపు వెయ్యి మంది వలంటీర్లకు ప్రస్తుతం టీబీ వ్యాక్సిన్ ఇచ్చింది. బ్రిటన్‌లో లక్షల మందికి చిన్నప్పుడే బీసీజీ టీకా ఎక్కించారు. అయితే ఇప్పుడు కరోనావైరస్ నుంచి రక్షణలో భాగంగా వారికి మరోసారి టీకా ఇస్తున్నారు. సాధారణంగా టీకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గతంలో టీబీ వ్యాక్సిన్ ఇతర వ్యాధులను కూడా తగ్గించింది. గినియోబిసావులో టీబీ వ్యాక్సిన్ వల్ల 38 శాతం శిశుమరణాలను తగ్గించగలిగామని వైద్య నిపుణులు చెబుతున్నారు. న్యుమోనియా, సెప్సిస్ వ్యాధులను ఈ టీకా తగ్గించగలిగింది.
టీబీ వ్యాక్సిన్ కరోనా వ్యాధిని 100 శాతం అరికడుతుందని చెప్పలేం. కానీ ఈ కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ టీకా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రెజిల్ లో కూడా ఈ విషయంపై అధ్యయనం సాగుతున్నది.
చిన్నప్పుడు బీసీజీ వ్యాక్సీన్ తీసుకున్నా రక్షణ లేని వారు మరోసారి టీకా తీసుకున్నా కోవిడ్-19 నుంచి అంత రక్షణ ఉండకపోవచ్చు. అయితే, 2005 తర్వాత బ్రిటన్‌లో క్షయ కేసులు బాగా తగ్గిపోవడంతో ఈ టీకాను ఇవ్వడం చాలావరకు తగ్గించారు. దీంతో ఇప్పుడు మళ్లీ టీబీ వ్యాక్సినేషన్ పెంచారు.