కరోనా కొత్త లక్షణాలు..ఇలా ఉంటె వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి!

Update: 2020-04-01 17:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ వైరస్ వెలుగులోకి వచ్చి మూడు నెలలు దాటిపోయినా కూడా ఇంకా వ్యాక్సిన్ కనిపెట్ట లేకపోవడం గమనార్హం.దీనితో కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి పగలు  - రాత్రి కస్టపడుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ గురించి  లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలోనే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా వైరస్ లక్షణాల గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు జ్వరం - జలుబు - దగ్గు.. కరోనా వైరస్ లక్షణాలుగా చెబుతూ వచ్చారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా సోకినట్టే అనే నిర్ధారణకు వస్తున్నారు. తాజాగా మరో విషయం బయటపడింది. విరోచనాలు - వాంతులు లేదా వికారం.. ఇవీ కూడా కరోనా లక్షణాలే అంటున్నారు డాక్టర్లు. తాము ట్రీట్ మెంట్ చేసిన కేసులను పరిశీలంచగా - కొంతమంది పేషెంట్లలో తొలుత ఈ లక్షణాలే బయటపడ్డాయని డాక్టర్లు తెలిపారు. ముందుగా కడుపు అప్ సెట్ అవుతుందన్నారు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆ తర్వాత విరేచనాలు స్టార్ట్ అవుతాయన్నారు

అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో  ఈ విషయాన్ని వెల్లడించారు.  తమ దగ్గరికి వచ్చిన చాలామంది పేషెంట్లలో జీర్ణ సమస్యలు గుర్తించామన్నారు డాక్టర్లు. కరోనా  కేవలం దగ్గు మాత్రమే కాదు. ఊపిరితిత్తులపై ఫోకస్ పెట్టాం. ఎందుకంటే ప్రాణం పోవడానికి ప్రధాన కారణం అదే. అయితే వైరస్ లాలాజలం లోకి ఎంటర్ అయితే - అది మింగితే - పేగుల్లోకి వెళ్లిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.మొత్తంగా కరోనా వైరస్ సోకిన కొంతమంది విరోచనాలు - వికారం - వాంతుల అవుతున్నాయని డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలుతోంది. అయితే వారిలో జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ శ్వాస సంబంధ ఇబ్బందులు - లక్షణాలు అస్సలు లేకపోవడం విశేషం. కాబట్టి ఎవరికైనా కూడా ఈ లక్షణాలు ఉంటె వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.
Tags:    

Similar News