నిన్న సాయంత్రం నుంచి రవీంద్ర జడేజా పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోతోంది. అందుకు కారణం. ఒకే ఓవర్. ఒకే ఒక్క ఓవర్ జడేజాను హీరోను చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ విజయాన్ని చేకూర్చింది. అంతేకాక భారీ స్కోర్ ను కూడా అందించింది. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సీఎస్కే తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ ను హర్షల్ పటేల్ వేశాడు. హర్షల్ పటేల్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టే వారికి ఈ క్యాప్ బహూకరిస్తుంటారు.
కోహ్లీ ఆఖరి ఓవర్ ను హర్షల్ పటేల్ కు ఇచ్చాడు. అయితే ఈ టైంలో స్ట్రైక్‌లోకి వచ్చిన జడేజా .. హర్షల్ బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. ఒకే ఓవర్ లో 37 పరుగులు తీశాడు. హర్షల్ ఓ బంతిని నో బాల్ వేయడం కూడా అందుకు ఓ కారణం. నో బాల్ వేయడంతో ఆ బంతిని సిక్స్‌గా మలిచిన జడేజా.. ఫ్రీ హిట్ ను కూడా సిక్స్‌గా మలిచాడు. దీంతో ఒకే ఓవర్ లో 37 పరుగులు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు సీఎస్కే ఫ్యాన్స్.
జడేజా బౌలింగ్‌తోనూ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అవి కూడా మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌లవి కావడం విశేషం. గతంలో జడేజా పై ప్రముఖ కామెంటేటర్ సంజయ్ ముంజ్రేకర్ కామెంట్లు చేశాడు. అతడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ కు పనికిరాడంటూ వ్యాఖ్యానించాడు. దీంతో అతడిపై ప్రస్తుతం నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. సంజయ్ ముంజ్రేకర్ ఇప్పుడేమంటావ్? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జడేజా ఫొటోలను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.