అయ్యా బాబోయ్ .. మానవ మూత్రం నుండి బీరు తయారీ !

Update: 2021-07-12 12:30 GMT
ప్రస్తుత సమాజంలో ఎంజాయ్ మెంట్ అంటే మద్యం. పెళ్లి , బర్త్ డే లేక ఇతర ఏ ఫంక్షన్ అయినా మద్యం లేనిదే ఫంక్షన్ పూర్తి కాదు. మద్యం లేని ఫంక్షన్ అంటే ఎవరూ పెద్దగా ఆసక్తి కూడా చూపించారు. మందు పడితేనే ఫంక్షన్ లో కిక్ వచ్చేది. ప్రస్తుతం ఇదే ట్రెండ్. చుక్క పడాలి .. చిల్ అవ్వాలి. ఇక అన్ని ఫంక్షన్స్ లో మందు లేకపోయినా హ్యాపీ మూమెంట్స్ , షాడ్ మూమెంట్స్ అంటూ కొన్ని మూమెంట్స్ కి క్రియేట్ చేసుకొని మందు లాగించేస్తుంటారు. మద్యం తాగడానికి ఇష్టపడే చాలామందికి బీర్ ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. కూల్ బీర్ త్రాగుతూ చాలామంది చిల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే  విషయం వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది.

ఎందుకు అంటే .. అక్కడ   మానవ మూత్రం నుంచి బీరు తయారుచేస్తున్నారు. మందుబాబులకు ఈ విషయం తెలిస్తే, బహుశా బీర్‌ పై అసహ్యం కలగవచ్చు. పిస్నర్ కంపెనీ మానవ మూత్రం నుండి బీరును తయారు చేస్తుంది. ఇది కొత్త కాన్సెప్ట్. అందుకే దీని గురించి చాలా మందికి కూడా తెలియదు. పిస్నర్ పేరులోనే పిస్ ఉంది, అంటే మూత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక నివేదిక ప్రకారం, కొన్ని సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఒక సంగీత కచేరీ నుండి 50,000 లీటర్ల మానవ మూత్రాన్ని సేకరించింది. ఆ తర్వాతే వారు తమ బీరు తయారీని వారు స్టార్ట్ చేశారు. సంస్థ బీరు తయారీని ప్రారంభించినప్పుడు, మూత్రాన్ని నేరుగా బీర్‌ తయారీలో వినియోగిస్తున్నారని చాలామంది ప్రజలు పొరబడ్డారట.

కానీ అది వాస్తవం కాదని సదరు సంస్థ తెలిపింది. బీరు తయారు అయ్యే బార్లీ పంటకు మేము యూరిన్ ద్వారా తయారు చేసిన ఎరువును వినియోగిస్తాం  అని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టును బీర్‌సైక్లింగ్‌ అని చెప్తారు. డానిష్‌ రైతులు ప్రపంచంలో ఉత్తమ రైతులు. మానవుల మూత్రాన్ని ఎరువుగా వాడి పంటలు పండిస్తున్నారంటే.. వారు ఇక దేనినైనా ఎరువుగా మార్చగలరు  అని డానిష్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. కాబట్టి నెక్ట్స్ టైమ్ పార్టీలో, జాగ్రత్తగా బీరు తాగండి. మీరు ఆనందిస్తున్న లిక్కర్ ఇంకొకరి మూత్రం కాకూడదు.
Tags:    

Similar News