స్వ‌రూపానంద సైలెంట్ వెనుక‌...!

Update: 2021-09-26 01:30 GMT
ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వాలకు.. మ‌ఠాధిప‌తుల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధాలు పెరుగుతున్న విష యం తెలిసిందే. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు.. పీఠాధిప‌తుల క‌నుస‌న్న‌ల్లో కొన్ని రోజులు నిర్ణ యం తీసుకున్నాయ‌నే.. విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నెల‌కో.. సంవ‌త్స రానికో పీఠాధిప‌తుల వ‌ద్ద‌కు వెళ్లి.. వారి ఆశీర్వాదం తీసుకున్న ప‌రిస్థితి మ‌న‌కు తెలిసిందే. అంతేకాదు.. హిందూ ధార్మిక విష‌యాల‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. స‌ద‌రు పీఠాధిప‌తు ల అభిప్రాయాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టిన ప‌రిస్థితి కూడా ఉంది.

మ‌రీ ముఖ్యంగా ఏపీ విష‌యానికి వ‌స్తే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు తాను అనేక యాగాలు, య‌జ్ఞాలు చేశామ‌ని.. విశాఖ జిల్లా చిన‌ముషిడివాడ‌కు చెందిన శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి త‌ర‌చుగా చెప్పిన విష‌యం తెలిసిందే. ఇక‌, ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేకంగా ఆశ్ర‌మానికి వెళ్లి.. స్వామిని ద‌ర్శించుకుని.. అనేక విష‌యాల‌పై చ‌ర్చించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు.. రాష్ట్రంలో గ‌త కొన్నాళ్లుగా కీల‌క అంశాల‌పై ర‌గ‌డ జ‌రుగుతోంది.

ఒక‌టి.. టీటీడీ బోర్డులో లెక్క‌కు ఎక్కువ‌గా స‌భ్యుల‌ను నియ‌మించ‌డం, రెండు.. టీడీపీ ఆన్‌లైన్ విధానాన్ని.. అంబానీ సంస్థ అయిన జియోకు అప్ప‌గించ‌డం.. మూడు.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను బీసీ సంక్షేమ శాఖ‌లోకి మార్చ‌డం .. వంటివి తీవ్ర వివాదంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే టీటీడీ బోర్డు విష‌యంలో హైకోర్టు మ‌ధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్ర‌త్యేక ఆహ్వానితుల జీవోను కొట్టివేసింది. ఇక‌, బ్రాహ్మ‌ణ కార్పొరేషన్ విష‌యం తేలాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలోని ప‌లువురి దృష్టి.. స్వ‌రూపానంద వైపే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన టీటీడీ బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను 52 మందిని ఏర్పా టు చేస్తూ.. ఇచ్చిన జీవో స్వామికి తెలిసే ఇచ్చార‌నేది ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌. దీనిని హైకోర్టు కొట్టి వేసింది. ఇక, బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను సంబంధం లేద‌ని బీసీ కార్పొరేష‌న్‌లో క‌ల‌పడంపైనా.. స్వామి మౌనంగా ఉన్నారు. పోనీ.. ఈ రెండు విష‌యాలు ఆయ‌న‌కు తెలియ‌కుండానే జ‌రిగిన‌ప్ప‌టికీ.. రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్నా.. ఎందుకు మౌనంగా ఉన్న‌ట్ట‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి దీనివెనుక‌.. ప్ర‌బుత్వం నుంచే ఆయ‌న‌కు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? లేక‌.. ఆయ‌నే మ‌న‌కెందుకులే అని దూరంగా ఉన్నారా? అనేది.. చూడాలి




Tags:    

Similar News