మంత్రి పదవి పట్టేయడమే రాజకీయాల్లో పరమపధ సోపానం కింద చెప్పుకుంటారు. ఎవరైనా మంత్రి పదవి కోసమే జపిస్తారు, పరితపిస్తారు. మామూలు ఎమ్మెల్యేగా ఉండడం ఎవరికైనా ఎందుకు నచ్చుతుంది. కాస్తా దర్జా దర్పం బుగ్గ కారు కావాలి అంటే అమాత్యుడు అనిపించుకోవాల్సిందే. కానీ దానికి కూడా ఒక పరిధి పరిమితి పెట్టేశారే. అపుడెపుడో అంజయ్య టైమ్ లో జంబో జెట్ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఏకంగా ఎనభై మంది దాకా మంత్రులు ఉమ్మడి ఏపీలో కనిపించారు నాడు. అలా పదవులు పొందిన వారిలో ప్రస్తుత తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు కూడా ఉన్నారు. బహుశా అది చూసిన తరువాతనే మొత్తం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలలో 15 శాతం కంటే మంత్రులు ఉండరాదు అని నిబంధన విధించారు అనుకోవాలి.
మొత్తానికి వైసీపీలో ఇపుడు మంత్రి వర్గ విస్తరణ టెన్షన్ బాగానే ఉన్నట్లుగా ఉంది. వైసీపీలో అలా ఇలా కాదు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇలా భారీ మెజారిటీ రావడం వల్ల కూడా వైసీపీలో ఉన్న వారి ఆశలు తీరడంలేదు. జగన్ కూడా అందరికీ మంత్రులను చేస్తామని చెప్పడంలేదు. చెప్పినా చేయలేరు కూడా. ఆయన కాకుండా పాతిక మందిని మాత్రమే మంత్రులను తీసుకునే వీలుంది. అలా కనుక చూసుకుంటే ప్రస్తుతం ఉన్న మొత్తం మంత్రివర్గాన్ని మార్చి మరో పాతిక మందిని తీసుకున్నా కూడా అక్కడికి యాభై మందికి మాత్రమే జగన్ అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది. అంటే అలా డేరింగ్ చేసినా కూడా వంద మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కాకుండా ఉండిపోతారు. మరి జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ అపుడే మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చ బాగానే జరుగుతోంది.
అది అటూ రాజకీయ వర్గాల్లోనే కాకుండా, ఆశవహులైన వైసీపీ ఎమ్మెల్యేలలో సైతం ఉంది. దానికి మించి ఇపుడు వైసీపీ మంత్రులు కూడా దీని మీద ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. ఈ మధ్యనే మంత్రి పేర్ని నాని మీడియా ముందు మాట్లాడుతూ తన పదవి ఎపుడు పోతుందో ఎవరికి తెలుసు అంటూ వైరాగ్యం ప్రదర్శించారు. తనకు మంత్రి పదవి మీద మోజు కూడా లేదని ఆయన చెప్పుకుంటున్నారు. మరి రెండున్నరేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన ఆయన ఇలా అనడం వెనక బాధ కూడా ఉందనే అర్ధం చేసుకోవాలి. కుర్చీలో కూర్చున్న తరువాత ఎవరైనా దిగిపోమంటే దిగిపోలేరు కూడా. ఇక పేర్ని నాని లాగానే మరో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తనకు మంత్రి పదవి లేకపోయినా ఫరవాలేదు అంటున్నారు. అది నిజంగా ఆయన గుండెల్లో నుంచి వచ్చిన మాటా అంటే జవాబు ఆయనకే తెలియాలి.
మొత్తానికి వైసీపీ మంత్రులలో ఏం జరుగుతోందో తెలియదు కానీ వారు మాత్రం తెగ బాధ పడుతున్నట్లుగానే వారు చేస్తున్న హాట్ కామెంట్స్ బట్టి తెలుస్తోంది. అయితే ఇక్కడ చిత్రమేంటి అంటే జగన్ నోరు తెరచి చెబితేనే తప్ప ఎవరు మాజీలు, ఎవరు తాజాలు అన్నది తెలియదు. ఆయన మాట మాట్లాడరు, మౌనంగానే పని కానిస్తారు. అందువల్ల మంత్రి వర్గ విస్తరణ అంటూ ముహూర్తం వచ్చేదాకా ఇలాంటి నిజాలూ నిట్టూర్పులు ఎన్నో మంత్రుల నుంచి వినాల్సిందే. ఏది ఏమైనా జగన్ కూడా మొత్తానికి మొత్తం మంత్రులను తీసేసి అతి పెద్ద సాహసం చేస్తారని కూడా ఎవరూ అనుకోవడంలేదు. ఆయన కూర్పు మార్పు అంతా తనదైన రాజకీయ నేర్పు మీదనే ఆధారపడిఉంటుంది. అంతవరకూ అంతా వేచి చూడాల్సిందే.