‘సూర్య’ప్రతాపం వెనుక ‘దేవీషాశెట్టి’.. స్ఫూర్తినిచ్చే కథ

Update: 2022-07-14 02:30 GMT

సూర్యకుమార్ యాదవ్. ఇంగ్లండ్ తో 3వ టీ20 సందర్భంగా సెంచరీ కొట్టి ఇంగ్లీష్ బౌలర్లకే దడపుట్టించి వారిని భయపెట్టిన బ్యాట్స్ మెన్. కామెంట్రీ చెబుతున్న వాళ్లందరూ వేయినోళ్ల పొగిడేశారు. ఎందుకంటే సూర్య ఆడిన షాట్లు అలాంటివి. వర్ధమాన క్రికెట్ లో అంత బీభత్సంగా ఆడినవారు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలో 360 ఆటగాడిగా పేరొందాడు. ఏ వైపు అయినా కొట్టగల ఆటగాడు సూర్యనే. 22 ఏళ్ల సూర్య కాలేజీలో తక్కువ.. గ్రౌండ్ లో ఎక్కువగా ఉండేవాడు. చదువుకన్నా క్రికెట్ పై ప్రేమ చూపాడు. అక్కడే కాలేజీలో కలిసింది ‘దేవీషా’. సూర్య జీవితంలోకి వచ్చిన దేవీషా అతడి రూపురేఖలు మార్చింది. హీరోయిన్ దేవీషా ఎంట్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే నాడే ఆమెను చూసి సూర్య పడిపోయాడు. అక్కడే పడిపోయిన సూర్య ఇష్టపడ్డాడు. గ్రౌండ్ లో సూర్య క్రికెట్ కు ఫిదా అయిన దేవీ షా కూడా ప్రేమలో పడిపోయింది. ఇద్దరి ప్రేమ సినిమా స్టైల్లో కలిసింది.

సూర్య 2012లో ఐపీఎల్ లోకి ప్రవేశించినా 2015లో గుర్తింపు రాలేదు. ఆ ఏడాది ముంబైతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా తరుఫున ఆడి 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దేశవాళీలో ఆడినా రాని పేరు ఐపీఎల్ లో దంచికొట్టడంతో వచ్చింది.

ఆ తర్వాత ఏడాది 2016 మే 29న  సూర్య-దేవీషా ఎంగేజ్ మెంట్ జరిగింది. 2016 జులై 7న వీరిద్దరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక క్రికెట్ లో సూర్యను నిలబెట్టింది దేవీ షా. తన కష్టమైన పరిస్థితుల్లో దేవీ షా అండగా ఉంటుందని.. వివాహం తర్వాత తను ఇబ్బందుల గురించి పక్కనపెట్టి క్రికెట్ పై దృష్టి పెట్టు అని ప్రోత్సహించిందని.. అవే నాలో నాటుకుపోయాయని.. అప్పుడే ప్రేమ అంటే ఏటో తన వల్లే తెలిసిందని సూర్య చెబుతుంటాడు.

దేవీ షా మాటలు సూర్యలో అంతులేని ధైర్యాన్ని నింపాయి. ఆ తర్వాత సూర్య చెలరేగిపోయాడు. తన కష్టాలు, బాధలు మరిచిపోయి ఆటపై దృష్టి పెట్టి 2016లో యూపీతో రంజీమ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో 90కి పైగా రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సూర్య ఎంపికయ్యారు.

ఇక ఈ దెబ్బకు ఐపీఎల్ లో కోల్ కతాకు సత్తా చాటాడు. పేరు వచ్చింది. కేకేఆర్ కు వైస్ కెప్టెన్ గా కూడా అయ్యాడు. ఆ తర్వాత ఇతడి రాణింపుతో 2018 మెగా వేలంలో రూ.3.2 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ముంబై టాప్ ఆర్డర్ లో ఆడుతూ రెచ్చిపోయాడు. ఏటా ఆడుతూ ఐపీఎల్ లో సూర్య టాప్ క్రికెటర్ గా ఎదిగాడు. అయితే టీమిండియాలోకి ఎంట్రీ మాత్రం తొందరగా దక్కలేదు.

ఎంతో కాలం ఐపీఎల్ లో ఆడినా సూర్యకు అవకాశం రాలేదు. సుధీర్ఘ నిరీక్షణ తర్వాత 2021 ఇంగ్లండ్ పై టీ20ల్లో భారత జాతీయ జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్ కు ముందు ఉదయం 4 గంటలకు సూర్య భార్య దేవీషా ఫోన్ చేసి మరీ ‘నీ క్రికెట్ ప్రయాణం ఇప్పుడే మొదలైందని.. టీం ఇండియా చరిత్రలో నీ పేరున ఓ పేజీ రాసుకోవాలనే కసి కనిపించాలని’ స్ఫూర్తినింపింది.

ఇక ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో  టీ20లో మార్చి 14న ఎంట్రీ ఇచ్చిన సూర్య.. తొలి మ్యాచ్ లోనే భీకర ఇంగ్లీష్ బౌలర్ ఆర్చర్ బౌలింగ్ లో తొలి బంతినే సిక్స్ కొట్టి ఘనంగా ఎంట్రీ చాటాడు. అతడు తొలి బంతిని ఎదుర్కొన్న తీరు చూసి క్రీడా పండితులు, ఆటగాళ్లు, కామెంటర్స్ వేయినోళ్ల పొగిడారు. సూర్యలో టీమిండియాకు ఆడాలన్న కసి ఎంత ఉందో.. ఆత్మవిశ్వాసం ఎంతో ఇది నిరూపించింది. సూర్య ఇలా ఆడుతున్నాడంటే దానికి కారణం ఆయన భార్య దేవీషానే. ఇప్పుడు ప్రపంచం మెచ్చే భీకర ఆటగాడిగా మారడం వెనుక ఆయన భార్యనే ఉన్నది. అందుకే సూర్య వెన్నెముక ఆయన భార్యనే..
Tags:    

Similar News