బెజవాడ మార్కెట్ చూస్తే భయమేయడం ఖాయం?

Update: 2020-07-17 11:50 GMT
‘‘కరోనా సోకుతుంది.. జాగ్రత్తలు పాటించండి.. సోషల్ డిస్టేన్స్ ఉండండి’’ అంటే ఎవరు వింటున్నారు.. ఎవరూ వినడం లేదు. కేవలం ప్రచారానికి మాత్రమే ఈ వ్యాఖ్యలు దోహదపడుతున్నాయి. అవును జనాల్లో కరోనా పట్ల భయం ఎంత ఉందో.. వారి చేష్టల్లో అంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. మాస్కులు పెట్టుకోకుండా.. చేతులు సబ్బుతో కడుక్కోకుండా.. హ్యాండ్ శానిటైజర్లు వాడని వారు ఎందరో ఉన్నారు.

ఇప్పటికే ఏపీలో సగం కేసులు పెరగడానికి పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కోయంబేడు మార్కెట్ కారణమైంది. అక్కడికి ఏపీ వ్యాపారులు, రైతులు వెళ్లి కరోనాను అంటించుకొని వచ్చి ఏపీలో వందలాది మందికి అంటించారు. పెద్ద మార్కెట్ అయిన కోయంబేడుకు ఏపీ రైతులు వందల సంఖ్యలో వెళ్లి వస్తుండడంతో వారికి సోకి ఏపీలోనూ కేసులు పెరిగాయి.

ఇక పక్కరాష్ట్రంలోనే కాదు.. ఏపీలోనూ అదే నిర్లక్ష్యం.. అదే కథ పునరావృతమవుతోంది. విజయవాడ నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్ కూడా ఇలాంటి భయాన్ని కలిగిస్తోంది. మామూలు రోజుల్లో ఈ మార్కెట్ ఎంత రద్దీగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ కరోనా టైంలోనూ జనాలు అలానే రద్దీగా వస్తువులు కొనడం.. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఎగబడుతుండడం.. సామాజిక దూరం అస్సలే పాటించకపోవడంతో గుంటూరు, కృష్ణ జిల్లాల్లో కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి..

కృష్ణ జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం విజయవాడలోనే ఉన్నాయి. కాళేశ్వర మార్కెట్ రద్దీ చూస్తూ సగం ఇక్కడే వ్యాపించే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జనాలు కంట్రోల్ లో లేకపోయినా.. అధికారులు మార్కెట్ ను కంట్రోల్ చేయకపోతే కోయంబేడు మార్కెట్ ను మించి బెజవాడ మార్కెట్ కరోనాను వ్యాపింపచేస్తుందనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి.
Tags:    

Similar News