మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లు ఆ పని చేస్తారట.. షాకిచ్చిన స్టోక్స్

Update: 2021-03-28 11:30 GMT
విన్నంతనే విచిత్రంగా అనిపించటమే కాదు.. నిజమా? అన్న విస్మయం వ్యక్తమయ్యే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఈ సీక్రెట్ ను రివీల్ చేసింది ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కావటంతో నమ్మక తప్పని పరిస్థితి. భారత్ లో సుదీర్ఘ ట్రిప్ లో భాగంగా పర్యటిస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ టీం..తాజాగా రెండో వన్డేలో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాట్ తో విశ్వరూపమే చూపించారని చెప్పాలి.

కేవం 52 బంతుల్లో పది సిక్సర్లు.. నాలుగు ఫోర్లు బాదేసిన అతడు.. ఏకంగా 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీ మిస్ అయ్యాడేమో కానీ టీమిండియా బౌలర్లకు తన బ్యాట్ తో చుక్కలు చూపించాడని చెప్పాలి. అతగాడి భారీ స్కోర్ ఆ జట్టును విజయ తీరాలకు చేర్చిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా తమ జట్టుకు సంబంధించిన ఒక రహస్యాన్ని తాజాగా రివీల్ చేశాడు బెన్ స్టోక్స్.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులంతా మ్యాచ్ కు ముందు.. మహిళలు వాడే డియోడ్రెంట్లనే వినియోగిస్తారట. విన్నంతనే నిజమని నమ్మలేని ఈ విషయం మీద బెన్ మాట్లాడుతూ.. ‘వాటి సువాసనం ఎంతో బాగుంటుంది. నాకైతే దానిమ్మ కు సంబంధించిన ఫ్లేవర్ ఇష్టం. నేనొక్కడినే కాదు.. మా టీం మొత్తం ఉమెన్ డియోడ్రింట్లే వినియోగిస్తారు’ అంటూ టాప్ సీక్రెట్ రివీల్ చేశాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Tags:    

Similar News