ఈ మోడీకి ఏమైందంటూ మనసులో ఉన్న కోపాన్ని ఒక్క మాటలో తేల్చేసే ప్రయత్నం చేస్తున్నారంతా. ఇంతకీ మోడీ అంత కాని పనేం చేశారు? నల్లధనాన్ని చెక్ చెప్పాలనుకున్నాడు. అందుకోసం పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ప్రకటించినంతనే.. నల్ల కుబేరులకు తిక్క కుదిరిందంటూ సంతోషపడినోళ్లు ఎంతోమంది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల వేళ.. మోడీ నోట రద్దు మాట విన్న వెంటనే కనిపించిన ప్రతి ఒక్కరితో ఈ విషయం గురించి మాట్లాడటమే కాదు.. ఈ దెబ్బతో నల్ల కుబేరులకు తిక్క కుదిరిపోవటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ సందడి ఇలా సాగుతున్న వేళ.. మరికొందరు ముందుజాగ్రత్త పరులు ఏటీఎంలకు పరుగులు తీశారు. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లుగా ఐదు.. పది వేల చొప్పున డ్రా చేశారు. ఈ హడావుడిలో అసలు పాయింట్ మిస్ అయ్యారు. నాలుగు వందలకు పైన ఎంత మొత్తం డ్రా చేసినా.. మరికాసేపట్లో రద్దుకానున్న పెద్దనోట్లు వస్తాయి కదా? అన్న చిన్న పాయింట్ మిస్ అయి.. చేతికి వచ్చిన పెద్దనోట్లను చూసి తిట్టుకున్న పరిస్థితి. మరికొందరు పెట్రోల్ బంకుల వైపు క్యూ కట్టారు. ఇదంతా ఎందుకంటే.. ఏదో జరిగిపోతుందన్న ఆత్రుత.. హడావుడి కారణంగా మాత్రమే.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చేతిలో చిల్లరనోట్లు లేక కిందా మీదా పడే పరిస్థితి. కానీ.. కాస్తంత ఆలోచించి చూస్తే.. ఇంట్లో ఉన్న చిల్లర నోట్లను ఒక కొలిక్కి తీసుకొచ్చినా.. ఇంతేసి హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఇవాల్టి రోజు డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డులు ఉండనే ఉన్నాయి. అవసరానికి సరిపడా మొత్తాన్ని.. అవసరాల్ని ఈ కార్డులతో తీర్చుకునే వీలుంది. నగరాల్లో ఉండే వారికి అయితే కార్డులతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పట్టణాలు.. మున్సిపాలిటీలు.. గ్రామాల్లోనే అసలు ఇబ్బంది అంతా.
అయితే.. ఇదంతా ఎంత కాలం అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరికిపోతుంది. చెలామణిలో ఉన్న రూ.1000.. రూ.500 నోట్లు ఎంత ఉన్నాయన్న విషయం ఇప్పటికే అంకెల రూపంలో బయటకు వచ్చేశాయ్. ఆ నోట్లు మొత్తంగా కాకున్నా.. అందులో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి చేరిపోతే.. మిగిలినదంతా బయటకు కక్కలేని నల్లధనమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ మొత్తం బయటకు రాని నేపథ్యంలో.. దాని స్థానే కొత్త నోట్లు అందుబాటులోకి వస్తాయి. అది జరిగినప్పుడు ప్రభుత్వం చేతి నిండా పుష్కలంగా డబ్బులు ఉంటాయి. పన్నులు తగ్గించే వీలుంది. పారదర్శకతతో మరింత మెరుగైన పాలనకు వీలుంది.
అయితే.. ఇదంతా జరగాలంటే కాస్తంత ఓపిక అవసరం. కాస్తంత కష్టం తప్పదు. కష్టం.. నష్టం అన్నది లేకుండానే బతుకీడుస్తున్నామా? పొద్దున్నే టిఫిన్ సెంటర్ కి వెళితే.. టిఫిన్ కోసం పావు గంట సేపు వెయిట్ చేయట్లేదు? పెద్ద హీరో సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ల కోసం ఎంత హడావుడి పడిపోతాం. ఇందుకోసం ఎన్ని పని గంటల్ని వృధా చేస్తుంటాం. అంతదాకా ఎందుకు భారీ వర్షాలు.. వరదలు.. తుఫానులు.. ప్రకృతి బీభత్సాలు చోటు చేసుకున్నప్పుడు కష్టపడటం లేదు. ప్రజలు పడే కష్టాల్ని తీర్చేందుకు ప్రభుత్వాలు ఎంతలా స్పందిస్తాయో తెలిసిందే.
అలాంటిది దేశం మొత్తమ్మీదా ఉన్న నల్లధనం అంతు చూసేందుకు కేంద్రం ఒక కార్యక్రమం మొదలెట్టినప్పుడు కాసింత చికాకులు తప్పవు. దానికే హైరానా పడిపోయి.. పెద్దనోట్లను రద్దు చేసిన మోడీని చావు తిట్లు తిట్టాల్సిన అవసరం ఉందా? ఉద్యమాలు.. బంద్ లు లాంటి వాటి కారణంగా.. సమ్మెల సమయంలో తిప్పలు పడకుండానే ఉన్నామా? ఆటోవాలా నుంచి ఎవరికి కోపం వచ్చినా సమ్మె చేస్తూ జనాలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు.. సర్లేనని సర్ది పుచ్చుకోలేదు. ఎన్నిసార్లు ఎన్ని కష్టాలు కాయలేదు..? అలాంటప్పుడు నల్లధనం మీద మోడీ పూరించిన సమర శంఖంతో కాసిన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అంతమాత్రానికే హడావుడి పడిపోయి.. హైరానా చెందిన నానా తిట్లు తిట్టేసే కన్నా.. ఒక ప్రయత్నం చేస్తున్నందుకు ఎవరికి వారు ఎంతోకొంత మద్దతు ఇస్తే.. రేపొద్దున మంచి ఫలితం వస్తే వాటి ఫలాలు అనుభవించేది మనమే కదా.
ఎవరికి దాకానో ఎందుకు.. ప్రతి నెలా రాష్ట్రాలు తీసుకునే రుణాల(బాండుల్ని అమ్ముకొని) ముచ్చటే తీసుకుందాం. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో బ్యాంకుల వద్దకు భారీగా నగదు నిల్వలు చేరుకుంటున్న వేళ.. రాష్ట్రాలకు తక్కువ మొత్తం వడ్డీకే రుణాలు ఇచ్చేస్తున్న పరిస్థితి. ఓపక్క పెద్దనోట్ల రద్దుపై కేంద్రంపై ఫైటింగ్ దిగుతున్న రాష్ట్రాలు.. తాము ఇప్పటికే పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రయోజనం పొందుతున్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు లబ్థి పొందినట్లే.. రేపొద్దున సామాన్యుడి కూడా లాభ పడొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు. కష్టాలు మనకు మామూలే. కొత్తేం కాదు. అలాంటప్పుడు నోట్ల కష్టాలు తాత్కాలికమే తప్పించి శాశ్వితం కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/