పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కోల్‌కతా హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. సీఎం కి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. దీనికి అసలు కారణం ఏంటో తెలుసుకుంటే షాక్ అవుతారు. కోల్‌కతా హైకోర్టు జడ్జి కౌశిక్ చందాకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని, తన వ్యాజ్యాన్ని ఆయన విచారించకూడదని మమతాబెనర్జీ డిమాండ్ చేసింది. ఆమె వ్యాఖ్యలకి ఆ న్యాయమూర్తి కౌశిక్ సీరియస్ గా తీసుకుని, తనపై నిరాధార ఆరోపణలు చేసిన సీఎంకు జరిమానా విధించారు. దీనితో ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో ఆ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. జడ్జికి కళంకం తెచ్చే విధంగా సీఎం మమతా బెనర్జీ ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్దమైన విధులను ఆమె ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు.
నందిగ్రామ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మమతాబెనర్జీ, ఎన్నికల్లో, ఓట్ల లెక్కింపులోనూ అక్రమాలు జరిగాయని, కావున సువేందు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ కౌశిక్ చందా విచారణ చేపట్టారు. ఈ పిటిషన్ ప్రజా ప్రాతినిధ్యం చట్టం-1951కి అనుగుణంగా వేశారా లేదా అనే విషయమై ఓ నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు జడ్జి కౌశిక్ ఆదేశాలు కోరారు. ఈ క్రమంలోనే మమతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ జడ్జిని తన కేసు విచారించకుండా చూడాలని, ఆయనకు బీజేపీ నేపథ్యం ఉందని చీఫ్ జస్టిస్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆ కేసును కౌశిక్ విచారణ చేపట్టారు. ఇలా ప్రతి ఒక్కరి మీద ఆరోపిస్తూ, న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తూ పోతే, న్యాయ పరమైన కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని జడ్జి కౌశిక్ అభిప్రాయపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి రూ.5 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సొమ్మును కోవిడ్ బాధితులైన న్యాయవాద కుటుంబాలకు వినియోగిస్తామని తెలిపారు. నిన్ననే తెలంగాణ హైకోర్టులో కూడా ఇదే తరహా వాతావరణం నెలకున్న సంగతి తెలిసిందే. రామచంద్రరావు అనే న్యాయమూర్తిని నీటి ప్రాజెక్టుల విచారణ నుంచి తప్పుకోవాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కోరవడంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.