వ్యూహం ఎపుడూ పదును తేరి ఉండాలి. కొట్టాలీ అంటే కొట్టాలి. అంతే తప్ప మాటలు భారీగా చేతలు పేలవంగా ఉండకూడదు, కానీ దేశంలో విపక్షాల తీరు చూస్తే అలాగే ఉంది. ఒకరితో ఒకరికి పడదు. అంతా కలసి మోడీ మీద దండెత్తడం అయితే కల్ల అని తాజా పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో విపక్షాల తరఫున గట్టి అభ్యర్ధిని నిలబెడదామని విపక్షాలు ఇప్పటికి ఆరు నెలలుగా బిగ్ సౌండ్ చేస్తూ వచ్చాయి. ఈ విషయంలో కేసీయార్ సార్ హడావుడి మామూలుగా అయితే లేదు.
దేశమంతా ఆయన తిరిగేశారు. కొద్ది నెలలలో భారత రాజకీయాలలో పెను సంచలనమే అని కూడా మీడియాను ఊరించారు. అదంతా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసమే అని అంతా అనుకున్నారు. ఇక యూపీ సహా ఉత్తరాది ఎన్నికల ప్రకటన వెలువడడం దగ్గర నుంచి కామ్రేడ్స్ సహా కాంగ్రెస్ తో కలసి అన్ని పార్టీలు మోడీ షాల వ్యూహాలు ఈసారి చెల్లవంతే అనేశారు.
కొత్త రాష్ట్రపతి ప్రతిపక్షాల నుంచే వస్తారు అని కూడా గొప్పగా చెప్పుకున్నారు. ఉత్తరాది ఫలితాల తరువాత అదే రకమైన ధీమాను కనబరచారు. ఇక బెంగాల్ టైగర్ మమతమ్మ అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి అంటూ తెగ హుషార్ చేశారు. ఆమె దేశంలోని 22 జాతీయ పార్టీల అధినేతలతో పాటు ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు కూడా నేరుగా లేఖలు రాసారు. అంతా కలసి ఒక చోట సమావేశం జరపాలని కూడా ఆశించారు.
కానీ తీరా సమావేశాన్ని పెడితే ఎనిమిది మంది ముఖ్యమంత్రులూ హాజరు కాలేదు. ఇక జాతీయ నాయకులలో చాలా మంది డుమ్మా కొట్టారు. ఇక వీటికి ముందే విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా దిగ్గజ నేత శరద్ పవార్ పేరు అనుకున్నారు. కానీ ఆయన మొదట్లోనె సంధి కొట్టారు. తాను బరిలో నిలిచేది లేదని కూడా గట్టిగా చెప్పేశారు.
ఇక కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాలక్రిష్ణా గాంధీ పేర్లను పరిశ్లించడానికి ఒక కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. మొత్తానికి చూస్తే అంతన్నాడు ఇంతన్నాడు అన్నట్లుగా విపక్షాల మీటింగ్ గొప్పగా ఉంటుందని, బ్రహ్మాండం బద్ధలవుతుందని చెప్పి చివరకు తేల్చింది ఏంటయ్యా అంటే ఏమీ లేదని.
ఇండైరెక్ట్ గా బీజేపీకి మేలు చేస్తూ మమతమ్మ మీటింగ్ ముగిసింది. తమలో ఐక్యత లేదని, తమకు సొంత ఇగోలు తప్ప మరేమీ ముఖ్యం కావని విపక్షాలు రుజువు చేసుకున్నట్లు అయింది. ఒక వైపు దేశంలో జాతీయ పార్టీ పెడతాను అందరినీ కలుపుకుంటాను అని చెబుతున్న కేసీయార్ ఈ మీటింగుకు డుమ్మా కొట్టారు. అలాగే జాతీయ రాజకీయాల్లో మెరిసే కేజ్రీవాల్ కూడా ఎక్కడా అయిపూ అజా లేదు.
అంటే ఏతా వాతా తేలే విషయం ఏంటి అంటే మమత పిలిస్తే ఎవరూ రారు. కేసీయార్ పిలిస్తే కూడా మరికొందరు రారు. ఇలా ఎవరికి వారే తామే గొప్ప నాయకులు మిగిలిన వారు తమ వెనక్కే ఉండాలన్న ఉద్దేశ్యంతో వేస్తున్న ఎత్తులు చివరికి చిత్తు అవుతున్నాయి. ఇవన్నీ కూడా బీజేపీని ఇంకా బలపరుస్తున్నాయి.
పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అన్నట్లుగా ఎవరికి వారే యమునా తీరే అన్న ఈ విపక్ష కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని కమలనాధులు ఎపుడూ ఊహించలేదు. ఇపుడూ అదే జరిగింది. ఇక ఈ రకమైన విచిత్ర రాజకీయ విన్యాసాలతో దేశ ప్రజలకు కూడా మోడీని మించిన మొనగాడు లేడని మరో మారు విపక్షాలు చాటుతున్నాయనుకోవాలి. గమ్మున ఉన్నా సరిపోయే దానికి తొడగొట్టి సవాల్ చేసి మరీ చివరికు తుస్సుమనిపించడం వల్ల మేలు ఎవరికో ఈ రోజుకీ విపక్షం గ్రహించకపోవడమే జాతీయ రాజకీయ విషాదం.