రెండు.. మూడు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఆరు విమానాలకు సంబంధించి బాంబు బెదిరింపు సమాచారం వాట్సప్ ద్వారా రావటంతో.. ఉలిక్కిపడ్డ భద్రతాదళాలు.. వెనువెంటనే.. రెండు విమానాల్ని వెనక్కి తెప్పించి మరీ.. సోదాలు నిర్వహించారు. అందులో ఏమీ లేకపోవటం.. మిగిలిన నాలుగు విమానాల్లో అన్ని సోదాలు నిర్వహించారు. అందులోనూ ఏమీ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే.. ఈ బెదిరింపు వాట్సప్ సమాచారంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఆకాశ మార్గాల్లో ఉగ్రవాదులు దాడులు నిర్వహించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయానికి వచ్చిన ఫోన్ కాల్ కు ప్రాధాన్యత లభించింది. ఫోన్ కాల్ లో చెప్పినట్లుగా ఆరు విమానాల్లో ఏమీ లేదు. ఇంతకీ ఈ సమాచారం అందించిన ఫోన్ నెంబర్ ఎవరిది? వారికి ఈ సమాచారం ఎలా తెలిసింది? అన్నప్రశ్నలతో విచారణ అధికారులు దృష్టి సారించారు. కట్ చేస్తే.. దారుణమైన మోసంతో హత్యలకు సంబంధించి ఒక వ్యక్తి చేసిన దారుణాలు బయటకు వచ్చాయి.
సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. గోకుల్ ఉన్నత విద్యావంతుడు. ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కేరళకు చెందిన ఇతగాడికి ఫేస్ బుక్ ద్వారా అనురాధ అనే అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె ఢిల్లీలో ఉద్యోగిని. వారి మధ్య పరిచయం ప్రేమగా మారి ఆపై పెళ్లి పీటలకు ఎక్కింది. వారిద్దరూ కలిసిమెలిసి ఉన్న సమయంలో వారికో పాప పుట్టింది. ఇదే సమయంలో గోకుల్ కు బెంగళూరుకు బదిలీ అయ్యింది.
అతనితో పాటు.. భార్య అనురాధ రావటానికి అంగీకరించలేదు. దీంతో వీరిమధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే బెంగళూరుకు వచ్చిన గోకుల్.. ఒక పెద్ద భవనంలోని ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. ఈ సమయంలోనే అతడికి తన చిన్ననాటి స్నేహితురాలు మళ్లీ కనిపించింది. గోకుల్ నివాసానికి దగ్గర్లో ఉండే ఆమెతో పరిచయం మరింత పెరగటం.. ఆమెను ఏదోలా జీవితాన్ని పంచుకోవాలన్న ఆశ మొదలైంది.
తనతో వచ్చేయాలని ఆమెను కోరితే.. అది సాధ్యం కాదని తేల్చేసింది. దీంతో.. ఆమె భర్తను అంతం చేస్తే.. ఆమె తనకు దక్కుతుందన్న ప్లాన్ వేసిన గోకుల్.. ఇందులో భాగంగా ఆమె భర్తకు సంబంధించిన పత్రాల్నికొన్నింటిని తీసుకొని వాటి ఆధారంగా ఒక సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. దాంతో.. విమాన బెదిరింపు వ్యాట్సఫ్ మేసేస్ ను పంపి అతడ్ని ఇబ్బందుల్లోకి పెట్టాలనుకున్నాడు.
అయితే.. బెదిరింపు వాట్సప్ మేసేజ్ మీద ఆరా తీసిన అధికారులు గోకుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడికి తమదైన రీతిలో విచారణ చేయటంతో చేసిన నేరాన్ని అంగీకరించటంతో పాటు.. మరో దారుణ నిజాన్ని చెప్పేశాడు. తనతో రావటానికి నో చెప్పిన భార్యను.. మద్యం తాగింది తల మీద బలమైన వస్తువుతో మోది.. మెట్ల మీద నుంచి జారి పడినట్లుగా కథ అల్లి ఆమెను హత్య చేసిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇతని నోటి నుంచి వచ్చిన ఈ క్రైంను విన్న పోలీసులు షాక్ తిన్న పరిస్థితి. ఉన్నత విద్యావంతుడై.. చక్కటి ఉద్యోగం చేస్తూ.. ఇంత దారుణానికి పాల్పడ్డాడా? అని ఆశ్చర్యపోతున్నారు.