కరోనా ఎంత పాపం చేసింది. దేశంలో మనుషులకు సోకి వారి మరణాలకు కారణమవ్వడమే కాదు.. వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతీసింది. చాలా మంది పేదలకు ఆహారం లేకుండా చేస్తోంది. ఆహాకారాలు చేసేలా చేస్తోంది.
అయితే ఈ కరోనాతో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి బాగోతం కూడా వెలుగుచూడడం విశేషం. బెంగళూరులో కరోనా లాక్ డౌన్ తో ఒక భర్త అడ్డంగా బుక్కైపోయాడు.
బెంగళూరుకు చెందిన ఓ బట్టల వ్యాపారం చేసే బడాబాబుకు ఇద్దరు భార్యలు. ఇద్దరినీ వేర్వేరు ఇళ్లలో పెట్టి వారికి న్యాయం చేశాడు. మొదటి భార్యను చేసుకున్నాక కొన్నేళ్లకు వేరో మహిళపై మోజు పడి ఆమెను కూడా చేసుకున్నాడు. ఈ విషయం పంచాయితీకి దారితీసింది. అప్పటి నుంచి పంచాయితీ పెద్దల ఆదేశాను సారం చెరో వారం రోజులు భార్యల వద్ద ఉంటానని చెప్పుకొని సంధి చేసుకున్నాడు.
తాజాగా లాక్ డౌన్ తో ఇల్లు కదిలి బయటకు రాలేని పరిస్థితి. దీంతో రెండో భార్య వద్ద చిక్కుకుపోయాడు భర్త. లాక్ డౌన్ వల్ల 17 రోజులుగా రెండో భార్యా - పిల్లలతోనే కాలం గడుపుతుండడంతో మొదటి భార్య ఆగ్రహించింది. మొదటి భార్య వద్దకు వెళ్లకపోవడం.. ఆమె ఇంట్లో సరుకులు అయిపోవడం.. భర్త నుంచి స్పందన లేకపోవడంతో ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజాగా తన భర్తను తన ఇంటికి చేర్చాలని ఆమె బెంగళూరులోని మహిళా పోలీస్ హెల్ప్ సెంటర్ కు ఫోన్ చేసి కోరింది. ఇప్పుడు ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి విషయంలో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారట.. లాక్ డౌన్ తో బుక్కైన ఈ మొగుడి కథ ఇంట్రస్టింగ్ మారింది. అదీ విషయం..