8 కోట్ల కుక్క కిడ్నాప్.. ఆ చూకీ చెప్తే లక్ష మీదే !

Update: 2019-12-23 08:32 GMT
తాజాగా బెంగుళూరు లో ఒక కూడా కిడ్నాప్ అయ్యింది. అదేంటి ఎదో మనిషి కిడ్నాప్ అయ్యారు అన్నంతగా చెప్తున్నారు ..కిడ్నాప్ అయ్యింది కుక్కనే కదా అని చాలా ఈజీ గా తీసి పారేయకండి. ఆ కుక్క ఆచూకీ తెలిపిన వారికీ ఆ కుక్క యజమాని లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ లెక్కన ఆ కుక్క రేటు ఎంత ఉంటుంది అని ఆలోచిస్తున్నారా ..ఆ కుక్క రేటు అక్షరాలా 8 కోట్లు ?

పూర్తి వివరాలు చూస్తే .. తాజాగా  బెంగళూరు నగరం లో 3 సంవత్సరాల 6 నెలల వయస్సు గల  అలస్కన్ మలముటే బ్రీడ్ కుక్క కిడ్నప్ కు గురైయ్యింది. ఈ జాతి కుక్కలు చాలా ఖరీదైనవి. దీనితో తన కుక్క ఆచూకి చెప్పిన వారికి రూ. 1 లక్ష బహుమానం ఇస్తామని కుక్క యజమాని ప్రకటించారు. చైనా దేశానికి చెందిన అలస్కన్ మలముటే జాతి కు చెందిన ఎరుపు, తెలుపు రంగుల మిశ్రమం కలిగిన ఈ కుక్కను మూడు సంవత్సరాల క్రితం బెంగళూరు, శ్రీనగర్ కు చెందిన సతీష్ అనే వ్యక్తి రూ. 3 కోట్లు చెల్లించి ఖరీదు చేశాడు. తరువాత ఆ కుక్కను బెంగళూరు కు తీసుకు వచ్చిన సతీష్ దానిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ జాగ్రత్త గా చూసుకుంటున్నాడు.

ఈ మద్యే సతీష్ కుటుంబ సభ్యులు కుక్కను ఇంటి ముందు చైన్ తో కట్టేసి,  కుటుంబ సభ్యులు తమ తమ పనులలో బిజీ అయిపోయారు.  తరువాత బయటకు వచ్చి చూడగా చైన్ తో సహ తమ కుక్క కనిపించ లేదు. అక్కడ మొత్తం వెతికినా కూడా ఆ కుక్క ఆచూకీ దొరక లేదు. దీని తో కుక్కని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని లబోదిబో అన్నారు. ఇంతకీ కిడ్నాప్ కు గురైన కుక్క రేటు ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 8 కోట్లు. భారతదేశంలో ఆ జాతి కుక్కలు మూడు మాత్రమే ఉన్నాయి. ఆ మూడు కుక్కల్లో బెంగళూరు లో కిడ్నాప్ గురైన ఈ కుక్క ఒకటి కావడం విశేషం.

కుక్క కోసం ఎంతగా వెతికినా  ఫలితం లేకపోవడంతో ఫోటోలు తీసుకుని బెంగళూరు నగరం లోని హనుమంతనగర పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ లతో పాటు సోషల్ మీడియాలో ఆ కుక్క ఫోటోలు షేర్ చేసిన సతీష్ తన కుక్క ఆ చూకి చెప్పాలని అందరికీ మనవి చేస్తున్నాడు. కిడ్నాప్ కు గురైన సతీష్ కుక్క కొంత కాలం నుంచి అనేక డాగ్ షోలలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీనితో బెంగుళూరు  పోలీసులు సైతం మాయం అయిన కుక్క ఫోటోలు చేత పట్టుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో దాని కోసం వెదుకుతున్నారు.
Tags:    

Similar News