అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనుకున్నంత ఏకపక్షంగా జరిగే అవకాశమే లేదన్న విషయం తాజాగా నిరూపితమైంది. తుది పోటీకి ముందు.. సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థుల మధ్య జరిగే ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉండటం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు రిపబ్లికన్.. డెమోక్రాట్ పార్టీలకు చెందిన నేతల మధ్య ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి. రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్.. క్రూజ్ లు తుది అభ్యర్థిగా బరిలోకి నిలవాలని ఆశిస్తుంటే.. డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్.. శాండర్స్ పోటీ పడుతున్నారు.
ఇప్పటివరకూ జరిగిన పలు రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫు బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ గెలుపుబాటలో దూసుకెళుతున్నారు. అయితే.. తాజాగా జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి శాండర్స్ ఘన విజయం సాధించటం ఆసక్తికరంగా మారింది. తాజా ఫలితాలతో డెమోక్రాట్ల అభ్యర్థిగా తుది బరిలోకి దిగేందుకు హిల్లరీకి ఎదురు లేదన్నట్లుగా ఫీలైన వారికి అలాంటిదేమీ లేదని.. పోరు ఏకపక్షం ఎంతమాత్రం కాదన్న విషయం నిరూపితమైందన్న మాట వినిపిస్తోంది. వాయువ్య ఫసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా శ్వేతజాతీయులు.. ఉదారవాదులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో శాండర్స్ ఘన విజయం సాధించటం గమనార్హం. తాజా ఫలితం హిల్లరీకి షాకింగ్ గా మారుతుందనే చెప్పాలి.