వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని ఘట్టం. దీన్ని మధురాతి మధురంగా జరుపుకోవాలని ఆశిస్తారు. అంగరంగ వైభవంగా బంధు మిత్రులను పిలిచి తమ స్థాయిని చూపుతారు. మరికొందరు అనాథలకు అన్నదానం చేయడం, పెళ్లికి పెట్టే ఖర్చును ఏదైనా స్వచ్చంధ సేవా సంస్థలకు అందించడం వంటివి చేస్తుంటారు.
ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక జంట ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పెళ్లి సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా శుభమా అంటూ పెళ్లి చేసుకుంటూ ఇలాంటి నిర్ణయాలను ఎవరూ తీసుకోరు. తీసుకోవడానికి కూడా సాహసించరు. ఆంధ్రప్రదేశ్ లో ఈ జంట మాత్రం తమ పెళ్లి సందర్భంగా తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం విశేషం. వీరిని ఆదర్శంగా తీసుకున్న వధూవరులు బంధువులు 60 మంది కూడా అవయవదానానికి ముందుకు రావడం విశేషం.
ఈ మేరకు వీరంతా అవయవదానంకు సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేశారు. ఈ విశేషానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే.. డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వేలివెన్ను గ్రామంలో సతీష్‌కుమార్, సజీవ రాణి వివాహం జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో పెళ్లి రోజు ఏదైనా మంచి పనిచేయాలని వరుడు సతీష్ కుమార్ నిర్ణయించుకున్నాడు. తన అవయవాలను దానం చేయాలని నిశ్చయించుకున్నాడు. వధువు సజీవ రాణి కూడా వరుడి బాటలోనే నడవాలని నిర్ణయించుకుంది.
సతీష్ కుమార్ అవయవదానానికి ప్రతిజ్ఞ చేసేలా ఇతరులను కూడా ప్రోత్సహించాడు. ఈ మేరకు పెళ్లి కార్డుపై సందేశాన్ని ముద్రించారు. పెళ్లి కార్డులపై 'అవయవాలు దానం చేయండి - ప్రాణాలను రక్షించండి' అనే సందేశాన్ని చూసి ఆహ్వానితులు ఆశ్చర్యపోయారు.
సతీష్ కుమార్ ఆలోచనకు మంచి స్పందన వచ్చింది. వరుడు, వధువు తరపు 60 మంది బంధువులు అవయవ దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ జి. సీతామహాలక్ష్మికి పెళ్లి రోజున వధూవరులు అవయవదాన పత్రాలను అందించనున్నారు.
విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్ సహకారంతో సతీష్ కుమార్ తన పెళ్లి రోజున అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఆయన చేసిన ప్రతిజ్ఞను పలువురు మెచ్చుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.