ట్రంప్ మీదే పోటీ చేస్తానంటున్నాడు.

Update: 2018-04-29 11:43 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత బ్రాడ్ థార్‌. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఒంటికాలి మీద లేవ‌ట‌మే కాదు.. తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న ఆయ‌న అమెరికా అధ్య‌క్ష బ‌రిలో తాను నిలుస్తాన‌ని చెబుతున్నారు. పాల‌న‌లో మెరుగైన మార్పు లేకుంటే తాను త‌ప్ప‌కుండా పోటీ చేస్తాన‌ని చెప్పారు.

అమెరికా ఎన్నిక‌ల్లో ఉన్న ప్ర‌త్యేక‌త గురించి మాట్లాడుతూ.. నాయ‌కుల‌తో ఛాలెంజ్ చేయ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే వారితో పోటీ ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ట్రంప్ పాల‌న కానీ బాగుంటే ఆయ‌న‌తో పోటీ ప‌డాల‌ని ఎవ‌రు మాత్రం అనుకుంటార‌న్న బ్రాడ్.. తాను అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తానంటూ వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ట్రంప్ తీరును త‌ప్పు ప‌డుతూ చేసిన ప‌లు ట్వీట్లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

అమెరికా మంచి దేశ‌మ‌ని.. కాబ‌ట్టే గొప్ప‌గా ఉంద‌న్న బ్రాండ్‌.. ఆ గ్రేట్ నెస్ అమెరికాను పాలించే నేత‌లోనూ ఉండాలంటూ మండిప‌డ్డారు. ఓప‌క్క ట్రంప్ మీద‌కు సై అంటే సై అన్న‌ట్లుగా ట్వీట్లు చేస్తున్న ఆయ‌న‌.. 2020లో పోటీలోకి దిగేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌క్రియ‌ను షురూ చేయ‌లేద‌ని అధికారులు చెబుతున్నారు.

బ్రాడ్ ట్వీట్ల‌తో ఆగ్ర‌రాజ్యంలో ఇప్పుడాయ‌న హాట్ టాపిక్ గా మారారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాలంటే ట్రంప్ త‌ర‌హా నాయ‌కుల‌ను త‌రిమికొట్టాల‌న్నారు. ఇదిలా ఉంటే.. అధ్య‌క్ష ప‌ద‌వికి బ్రాడ్ త‌న పేరును న‌మోదు చేసుకోలేద‌ని ఫెడ‌ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్.. మ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘం లాంటిద‌నుకోండి. దీనిపై బ్రాడ్ రియాక్ట్ అవుతూ.. తాను ప్ర‌భుత్వం గురించి ప‌ట్టించుకోలేద‌న్నారు.

2020లో జరిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ మీద పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టివ‌రకూ ఎవ‌రూ ముందుకు రాలేదు. బ్రాడ్‌కు ముందు ప్ర‌ముఖ టీవీ చాన‌ల్ ప్ర‌యాక్త ఓప్రా విన్ ఫ్రే మాట్లాడుతూ తాను ట్రంప్ కు పోటీగా బ‌రిలోకి దిగుతాన‌ని వ్యాఖ్యానించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. త‌న‌ను ఓడించే స‌త్తా ఓప్రా విన్ ప్రేకు లేద‌న్నారు. మొత్తానికి రాజ‌కీయ నాయ‌కుల‌కు భిన్నంగా క‌ళాభిమానులు.. స్వేచ్ఛా ప్రియులు ట్రంప్ ను ఓడించేందుకు ఎన్నిక‌ల బ‌రిలోకి వ‌స్తామ‌ని ముందుకు రావ‌టం ఆస‌క్తిక‌రం. మ‌రి.. రాజ‌కీయ నాయ‌కులు ఎందుకు మౌనంగా ఉంటున్న‌ట్లు?
Tags:    

Similar News