మునుగోడులో బెట్టింగుల ప‌ర్వం.. ఏపీ నుంచే వ‌స్తున్నార‌ట‌!!

Update: 2022-10-26 09:31 GMT
తెలంగాణ‌లోని ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఉన్న మునుగోడునియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక‌జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఈ ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలిచినా.. మ‌హా అయితే.. ఆరు మాసాల‌కు మించి ఆ ప‌ద‌విలో ఉండే అవ‌కాశం త‌క్కువే. అయినా..కూడా దీనిని ప్ర‌ధాన పార్టీలు.. టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. దీంతో ఈ పోరు హోరా హోరీని త‌ల‌పిస్తోంది. ఎవ‌రికి వారు ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిపప్పుకొనేందుకు వారిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ‌.. పార్టీలు.. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నాయి. త‌మగోడు వినిపిస్తున్నాయి. త‌మ‌కు ఓటే యాల‌ని అభ్య‌ర్థిస్తున్నాయి.

అయితే. ఇంత ప్ర‌చార జోరు సాగుతున్నా.. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల‌కు తాయిలాలు పంచుతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే.. ఎవ‌రు ఎంత పంచుతున్నా.. ఒక‌రికి మించి మ‌రొక‌రు ఈ విష‌యంలోనూపోటీ ప‌డుతున్నారు. వారు ప‌ది ఇస్తే..

నేను ఇర‌వై ఇస్తా అన్న ధోర‌ణిలో పార్టీల నాయ‌కులు దూకుడు చూపిస్తున్నారు. స‌రే.. ఈ విష‌యం అలా ఉంచితే.. ఇప్పుడు మునుగోడులో మ‌రి చిత్రం క‌నిపిస్తోంది. అదే బెట్టింగులు. అది కూడా.. ఏపీ నుంచి వ‌స్తున్న వారు.. ఇక్క‌డ కోట్ల‌లో బెట్టింగులు క‌డుతున్నార‌ని స‌మాచారం. కోట్ల‌కు కోట్ల రూపాయ‌ల‌ను బెట్టింగుల్లో క‌ట్టేందుకు వారు రెడీ అయ్యార‌ని చెబుతున్నారు. కానీ, వీరు నేరుగా రంగంలోకి దిగిపోవ‌డం లేద‌ట‌.

మునుగోడు రాజ‌కీయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు.. ప‌రిశీలించేందుకు బెట్టింగు రాయుళ్లు కొంద‌రు.. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లోనూ.. తిష్ట‌వేశార‌ని అంటున్నారు. ఇక్క‌డి విలాస‌వంత‌మైన హోట‌ళ్ల‌లో బ‌స చేస్తూ.. మునుగోడులో త‌మ ఏజెంట్ల‌ను దింపుతున్నార‌ని.. వారి ద్వారా.. ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు.. తెలుసుకుంటున్నార‌ని చెబుతున్నారు. ప‌రిస్థితిని బ‌ట్టి.. బెంటింగ్ మారిపోతోంద‌ని అంటున్నారు. పైగా.. ఇలా విలాస‌వంత‌మైన హోట‌ళ్ల‌లో ఉంటున్న‌వారు .. రెండు రోజుల కు మించి.. అక్క‌డ ఉండడం లేదు. ప్రాంతాలు మారిపోయి.. త‌మ ఆవాసాల‌ను మార్చుకుని.. ఇక్క‌డ జ‌రుగుతున్న‌రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తూ.. పందేలు క‌డుతున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌ధానంగా.. బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్‌రెడ్డి గెలుస్తారంటూ.. ఎక్కువ‌గా పందేలు న‌డుస్తున్నాయ‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇక‌, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెలుస్తార‌ని.. చెబుతున్న‌వారు కూడా.. క‌నిపిస్తున్నారు. దీంతో ఈ ఇద్ద‌రు నేత‌ల‌పైనే ఎక్కువ‌గా పందేలు న‌డుస్తుండడం గ‌మ‌నార్హం.

వీరిలో కొంద‌రు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా.. ఉన్నార‌ని స‌మాచారం. ఇదిలావుంటే.. పందేలు క‌డుతున్న బెట్టింగు రాయుళ్లు.. తాము ఎవ‌రిపై అయితే.. పందెం కాశారో.. వారు గెలుస్తారంటూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తుండ‌డం కొస‌మెరుపు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల మైండ్ సెట్ మార్చేసి.. వారు ల‌బ్ధి పొందాల‌ని అనుకుంటున్న‌ట్టు తెగ చ‌ర్చ‌సాగుతోంది. మ‌రి వీరిపైక‌న్నేసేవారు ఎవ‌రు? క‌ట్ట‌డి చేసేవారు ఎవ‌రు ? అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News