నెగటివ్ వచ్చిన తర్వాత ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Update: 2022-02-09 01:30 GMT
కరోనా వచ్చిన వారిలో ఆ లక్షణాలు కనిపించడం అనేది సర్వ సాధారణం. అయితే కొందరిలో లక్షణాలు లేకపోయినా కానీ వైరస్ సోకుతుంది. వారు  టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రిపోర్టు చెప్తుంది. ఇలా ఎటువంటి లక్షణాలు లేకుండా వైరస్ బారిన పడిన వారు చాలా మందే ఉన్నారు.

ఇదిలా ఉంటే కొత్తగా కరోనా బారిన పడిన కొంత మందిలో కూడా వైరస్ తాలూకు లక్షణాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆఖరికి వారికి పాజిటివ్ వచ్చినా కానీ లక్షణాలు తగ్గడం లేదని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. లక్షణాలు ఉండటం మాత్రమే కాకుండా అవి వారిని బాగా ఇబ్బంది పెడుతున్నట్లు కూడా తెలిపారు.

వాటిని పోస్ట్ కోవిడ్ లక్షణాలు అంటారని  వైద్య ఆరోగ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి కాస్త జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఏంటి? అవి ఎలా ఉంటాయి అనేది ఓ సారి తెలుసుకుందాం.
 
సాధారణంగా కోవిడ్ సోకిన రోగికి జలుబు, జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, దగ్గు, విరేచనాలు, ముక్కు బిగుసుకు పోవడం, శ్వాస ఆడకపోవడం లాంటివి జరుగుతాయి. ఎక్కువ మందిలో అయితే జ్వరం రావడం,  జలుబు, దగ్గు లాంటివి ప్రాథమిక లక్షణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి ఉంటే ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తుంటారు.

అయితే ఇప్పుడు కేవలం కోవిడ్ సోకిన సమయంలో మాత్రమే కాకుండా.. కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని లక్షణాలు అలాగే ఉంటున్నాయి. ఈ పోస్ట్ కోవిడ్ లక్షణాలు ప్రధానమైనవి శ్వాసకోశ సమస్యలు. అందులోనూ ఊపిరితిత్తులకు సంబంధించినవి. అయితే వీటితో పాటు ఒళ్లు నొప్పులు, శరీరం అలసిపోయినట్లు అనిపించడం, తలనొప్పి లాంటి లక్షణాలు పోస్ట్ కోవిడ్ లక్షణాలుగా ఉంటున్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి చాలా రోజుల పాటు తగ్గకుండా ఉంటే కోవిడ్ నెగిటివ్ వచ్చినా సరే ఇంట్లో వారికి దూరంగా ఉండాలని  అంటున్నారు.

కరోనా సోకిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు  అయితే పాటిస్తామో అలాంటి జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. లేకపోతే మీతో ఉండే వారికి కూడా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. అంతే గాకుండా ఈ విధమైన లక్షణాలకు నిపుణులు ఓ పేరు  పెట్టారు. అక్యూట్ కోవిడ్ సిండ్రోమ్ గా దీనిని పిలుస్తున్నారు. రోగి కోవిడ్ ఇన్ఫెక్షన్ను కలిగి ఉంటే అధి దీర్ఘకాల కోవిడ్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండే వారు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. తగిన విధంగా చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న ఇతర వ్యాధులు సోకకుండా ఉంటాయి. లేకపోతే  పోస్ట్ కోవిడ్ లక్షణాలతో పాటు వీటి నుంచి కూడా బాధ పడాల్సి వస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, బలహీనత ఉంటే మాత్రం ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేకపోతే వాటి ప్రభావం గుండె, మెదడు, కిడ్నీలపై పడుతుంది. అందుకే పోస్ట్ కోవిడ్ లక్షణాలు కనిపించిన అన్నీ రోజులు వీలైనంత ఎక్కువగా ఒంటరిగా బతకడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

వీటితో పాటు కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆకలి లేకపోవడం, వాసన తెలియక పోవడం వంటివి కూడా ఉంటాయి. వీటి వల్ల శరీరంపై ఒత్తిడి పడి అతిసారం,  డైజీషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఈ సమయంలో శరీరానికి కొంత రిలాక్సేషన్ కోసం వ్యాయామం లాంటివి చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News