అగరుబత్తీల పొగ ఎంత ప్రమాదమంటే...

Update: 2015-08-27 07:41 GMT
పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం! ప్రతీ సిగరెట్ ప్యాకెట్ పైనా, ప్రతీ సినిమా మొదట్లోనూ, రోడ్లపైనా, బోర్డులపైనా.. నిత్యం వినిపించే స్లోగన్! పొగ అంటే... ఇక్కడ పొగాకు ఉత్పత్తులకు సంబందించిన చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి. అయితే ఇది కరక్టే కానీ... తాజాగా ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల పీల్చే పొగతో పాటు అగరుబత్తీల పొగ కూడా అనారోగ్యమేనంటున్నారు శాస్రవేత్తలు! అంటే... ఇకపై అగరుబత్తీల ప్యాకెట్లపై కూడా ఆ స్లోగన్ రాయాలా? వద్దా అనే సంగతి పక్కనపెడితే... తాజాగా సౌత్ చైనా వర్శిటీ పరిశోధకులు ఈమేరకు ఒక కొత్త విషయాన్ని చెబుతున్నారు!

గుప్పుగుప్పున వదిలే సిగరెట్ పొగతోనే కాదు... ఇళ్లల్లోనూ, దేవుడి పూజ సమయంలోనూ వెలిగించే అగరుబత్తిల పొగకూడా ఆరోగ్యానికి హానికరమట. రకరకాల ఫ్లేవర్స్ తో, ఇంటి నిండా చక్కని సువాసనలు వెదజల్లే అగరుబత్తీల్లో 64 రకాల రసాయనాలు ఉంటాయని... వీటిలో చాలావరకూ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాదులకు కూడా ఈ అగరుబత్తీలు కారణమవుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు! ఇకపై అగరుబత్తీలు వెలిగించాలన్నా కూడా కాస్తంత ఆలోచించాల్సిన పరిస్థితి మరి!
Tags:    

Similar News