పాకిస్థాన్ కోడ్‌ తో ప.గో. వాసులకు ఫోన్ కాల్స్!

Update: 2016-10-09 05:33 GMT
ఇప్పుడు దేశంలోని చాలా మందికి కొత్త భయం పట్టుకుందట! ఫోన్ వస్తుంటే చాలు భయాందోళనకు గురవుతున్నారట!! దానికి కారణం... అది పాకిస్థాన్ నుంచి వస్తున ఫోన్ కాల్ మరి!! ఈ రేంజ్ లో భయపెడుతున్న ఫోన్ కోడ్ +92. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుందట ఈ ఫోన్ నెంబర్ కోడ్. పాకిస్థాన్ కోడ్ ఏమిటి... పశ్చిమగోదావరి జిల్లా వాసులకు ఫోన్ కాల్స్ రావడమేమిటి అని కంగారు పడుతున్నవారికి, అలాంటి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే పోలీసులకు తెలియజేయడం మంచిదని పలువురు సూచిస్తున్నారట!

పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతాల్లో +92 3045414385 నంబరుతో ఫోన్‌ కాల్స్‌ రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారట. మరో పక్క వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియాలో ఇండియన్ ఆర్మీ హెచ్చరిక అంటూ వస్తున్న మెసేజ్‌ లు - ఫొటోలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 0092 కోడ్ తో కాల్స్ రావడం వారిని కంగారు పెడుతుందట. అయితే గోదావరి జిల్లాలోని ఎక్కువ మంది విదేశాల్లో ఉండటంతో, వేరే కోడ్ ఏది వచ్చినా కూడా తమ బందువులో - కుటుంబసభ్యులో చేస్తున్నారనుకొని రిసీవ్ చేస్తుంటారు. అయితే ఈ కొత్త కోడ్ మాత్రం కొత్త భయాలు పుట్టిస్తుందట. అయితే పలు ప్రాంతాల సమాచారం సేకరించేందుకు పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లు ఈ కాల్స్‌ చేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

అయితే ఇందులో వాస్తవాలను సేకరించి తెలియజేయాలని ప్రజలు కోరుతుండగా, అలాంటి కోడ్‌ తో వచ్చే ఫోన్ కా ల్స్‌ను రిసీవ్‌ చేసుకోవద్దని భద్రతా వార్గాలు పేర్కొన్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో పదే పదే పాకిస్థాన్ కోడ్‌ తో ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించడం మేలనేది పలువురి సూచన!!

ఒదే క్రమంలో గతంలో కూడా +92 నుంచి ఎవరికైనా మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేయవద్దని సూచనలు వచ్చిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News