ఖాతాదారులకు SBI హెచ్చరిక ...మెయిల్ వస్తే క్లిక్ చేయకూడదట !

Update: 2020-06-22 10:10 GMT
SBI ...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన ఖాతాదారులకు ఈ కష్ట కాలంలో హెచ్చరికలు జారీచేసింది. ఉచిత COVID-19 పరీక్ష పేరిట ఏదైనా ఇమెయిల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. పొరపాటున ఆ ఈ మెయిల్ పై  క్లిక్ చేస్తే మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఈ మేరకు SBI ట్వీట్ ద్వారా ఖాతాదారులను హెచ్చరించింది.

జూన్ 21 నుండి దేశంలోని పెద్ద నగరాల్లో సైబర్ ఎటాక్స్ జరగబోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. జూన్ 21 నుండి సైబర్ నేరస్థులు ఫిషింగ్ అటాక్ క్యాంపెయిన్ నిర్వహించవచ్చని CERT-In నుండి నివేదిక వచ్చిందని ఎస్బిఐ తెలిపింది. అనుమానిత ఇమెయిల్ ఐడి ncov2019@gov.in పేరుతో వస్తుందని పేర్కొంది. ఇమెయిల్ సబ్జెక్ట్ లైన్ 'ఫ్రీ కోవిడ్ 19 టెస్టింగ్'  అవుతుంది. అందువల్ల, ncov2019@gov.in మెయిల్ ఐడి నుండి ఏదైనా ఇమెయిల్ క్లిక్ చేయకుండా ఉండాలని SBI పౌరులను హెచ్చరించింది.

సైబర్ క్రైమినల్స వద్ద 20 లక్షల మంది పౌరుల ఇమెయిల్ ఐడిలు ఉన్నాయని ఎస్బిఐ తెలిపింది. 'ఉచిత కోవిడ్ 19 టెస్టింగ్' సబ్జెక్ట్ లైన్ ‌తో పాటు ncov2019@gov.in మెయిల్ ఐడితో ఇమెయిల్ పంపే అవకాశం ఉందని ఎస్బీఐ తెలిపింది. ఇమెయిల్ ద్వారా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరికలు  జారీ చేసింది.
Tags:    

Similar News