పరిటాల రవికి ఆగర్భశత్రువుగా - రవి హంతకుడిగా వార్తలకెక్కిన మద్దెలచెరువు సూరికి కుడిభుజంగా ఉండి ఆయన్నే చంపేసిన భానుకిరణ్ అరెస్టై జైళ్లో ఉన్నా తన తీరు ఏమాత్రం మార్చుకోలేదట. జైలు నుంచే సెటిల్ మెంట్లు, అక్కడే పార్టీలు చేసుకుంటూ హడావుడి చేస్తున్నాడట. ఆయన దగ్గర తరచూ ఏదో ఒకటి వద్దన్న వస్తువు దొరుకుతుండగా తాజాగా ఏకంగా పది మద్యం సీసాలు దొరకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
చర్లపల్లి జైల్లో ఉన్న భాను అక్కడి నుంచే తన దందాలు సాగిస్తున్నాడట. జైలు అధికారుల సహకారంతోనే అక్కడి నుంచి ఆయన బయట బెదిరింపులు, సెటిల్ మెంట్లతో అడ్డగోలుగా సంపాదిస్తున్నాడని టాక్.
గతంలోనూ భాను వద్ద ఫోన్లు... పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు దొరికాయి. తాజాగా జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భానుకిరణ్ దగ్గర 10 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారట. కట్టుదిట్టమైన భద్రత ఉన్న చర్లపల్లి జైలుకు అన్నేసి మందుసీసాలు ఎలా తెప్పించకుంటున్నాడు... అధికారుల అండ లేకుండా అది సాధ్యం కాదు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గట్టిగా వెతికితే ఆయన దగ్గర తుపాకులు దొరికినా దొరకొచ్చని కొందరంటున్నారు.