భార‌త్ బంద్‌ తో ఉత్త‌రాది భ‌గ్గు.. 9 మంది మృతి

Update: 2018-04-03 03:46 GMT
ఒక తీర్పు తొమ్మిది నిండు ప్రాణాలు పోయేలా చేయ‌ట‌మే కాదు.. దేశ వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు ర‌గిలేలా చేశాయి. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు నిర‌స‌నాగ్నిని ర‌గిలేలా చేసింది. ఎస్సీ..ఎస్టీ చ‌ట్టంలోని నిబంధ‌న‌ల్ని మారుస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో.. ఈ చ‌ట్టం నీరుకారుతుందంటూ ద‌ళిత సంఘాలు ఆందోళ‌న‌బాట ప‌ట్టాయి.

దేశ వ్యాప్తంగా వివిధ ద‌ళిత సంఘాలు ఇచ్చిన భార‌త్ బంద్ ప్ర‌భావం ద‌క్షిణాదిన లేకున్నా.. ఉత్త‌రాది మాత్రం నిర‌స‌న‌తో వ‌ణికింది. నిర‌స‌న‌కారుల ఆందోళ‌న హింసాత్మ‌కంగా మారి పెద్ద ఎత్తున నిర‌స‌న‌కారులు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున నిర‌స‌న‌కారులు గాయాల‌పాల‌య్యారు.

భార‌త్ బంద్ తీవ్ర‌త ఎంతంటే..?

భార‌త్ బంద్ సంద‌ర్భంగా చోటు చేసుకున్న నిర‌స‌న‌ల్లో తొమ్మిది మంది మ‌ర‌ణించారు.

మ‌ర‌ణించిన వారిలో ఏయే రాష్ట్రాల‌కు చెందిన‌వారు ఉన్నారంటే..?

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఆరుగురు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇద్ద‌రు. రాజ‌స్థాన్ లో ఒక‌రు.

భార‌త్ బంద్ సంద‌ర్భంగా భారీగా అల్ల‌ర్లు.. ఆందోళ‌న‌లు చోటు చేసుకున్న ప్రాంతాలేవంటే..?

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌..రాజ‌స్థాన్‌.. పంజాబ్‌.. బిహార్‌.. ఝూర్ఖండ్‌.. ఒడిశా.. గుజ‌రాత్‌.. హ‌ర్యానా.. మ‌హారాష్ట్ర.. ఢిల్లీ.. ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర రాష్ట్రాలు.

బంద్ తీవ్ర‌త ఎంతంటే..?
 
+ 100కు పైగా రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

+ ప‌లు రైళ్ల‌ను దారి మ‌ళ్లించ‌టం

+ వంద‌లాది మంది ఆందోళ‌న‌కారుల్ని అదుపులోకి తీసుకోవ‌టం

+  ప‌లు ప్రాంతాల్లో మొబైల్ ఫోన్‌.. ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేయ‌టం

+  మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో నిర‌స‌న‌లతో అట్టుడిగిపోతున్న‌ప‌రిస్థితిని అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలిపించారు

+ భిండ్‌.. గ్వాలియ‌ర్... మురైనాల‌లో క‌ర్ఫ్యూ విధింపు

+ నిర‌స‌నకారుల కారణంగా జ‌రిగిన దాడిలో ప‌దుల సంఖ్య‌లో పోలీసుల‌కు గాయాల‌య్యాయి

+ వేలాది మంది నిర‌స‌న‌కారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

+ ప‌లు రాష్ట్రాల్లో బ్యాంకులు.. పాఠ‌శాల‌లు..కాలేజీలు మూసేశారు. ప‌రీక్ష‌ల్ని వాయిదా వేశారు.

+ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. పంజాబ్ లో భిన్న‌త‌ర‌హాలో నిర‌స‌న‌లు చోటు చేసుకున్నాయి. పంజాబ్ లోని జ‌లంధ‌ర్‌.. అమృత్ స‌ర్.. బ‌ఠిండాల్లో వంద‌లాది మంది నిర‌స‌న‌కారులు క‌త్తులు.. క‌ర్ర‌లు.. బేస్ బాల్ బ్యాట్ల‌తో వీధుల్లోకి వ‌చ్చి బెదిరిస్తూ దుకాణాల్ని మూయించేశారు.

మ‌రింత జ‌రుగుతుంటే కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేసింది?

+ ప్ర‌జ‌లు శాంతంగా ఉండాలంటూ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు.

+  స‌మాజంలో సామ‌ర‌స్యం వెల్లివిరిసేలా అన్ని పార్టీలు సాయం చేయాల‌ని కోరారు

+ అల్ల‌ర్లు జ‌రిగే అవ‌కాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు

+ ద‌ళిత జ‌నాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో భారీగా బ‌ల‌గాల్ని మొహ‌రించారు

+ అల్ల‌ర్లు చెల‌రేగ‌కుండా బ‌ల‌గాల్ని భారీగా మొహ‌రించాల‌ని.. ఆందోళ‌న‌ల్ని అణిచివేయాల‌ని రాష్ట్రాల్ని కోరారు

+ నిర‌స‌న‌లు భారీగా ఉన్న రాష్ట్రాల‌కు సుశిక్షితులైన 1700 ఆర్ఎస్ ఎఫ్ సిబ్బందిని త‌ర‌లించారు.

+  ద‌ళిత సంఘాల ఆందోళ‌న నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో కేంద్రం స‌మ‌గ్ర స‌మీక్షా పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

+ సుప్రీంతీర్పులో మార్చులపై పున‌రాలోచించాల‌ని కోరింది.

+ చ‌ట్టంలోని పాత నిబంధ‌న‌ల్ని య‌థావిధిగా కొన‌సాగనివ్వాల‌ని కోరింది


Tags:    

Similar News