ఈ రోజు సమ్మె ఎందుకు జరుగుతుంది?

Update: 2016-09-02 10:01 GMT
భారత్ బంద్.. దేస వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె... అని వినపడగానే, వార్తలు రాగానే హమ్మయ్య రేపు స్కూలు సెలవు అని పిల్లలు అనుకుంటే, ఆ కారణంతో ఆఫీసులు బంద్ కొట్టోచ్చు అని వారి పిల్లలు అనుకునే రోజులివి! అసలు భారత్ బంద్ అనేది చిన్న పదం కాదు. దేశవ్యాప్తంగా ఒక బంద్ కు పిలుపునివ్వడం అనేది చాలా పెద్ద విషయం.. జాతీయ స్థాయి నాయకులకు కార్మికులు వారి వారి బాదలను చెప్పడానికి, విజ్ఞప్తులు విన్నవించడానికి చేసే ప్రయత్నం. అయితే ఈరోజు కూడా దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. అయితే ఈ రోజు సమ్మె గురించి ఎంతమందికి తెలుసు? ఈ సమ్మెలో ప్రత్యక్ష భాగస్వాములు కాలేకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది!

సుమారు పది జాతీయ కార్మిక సంఘాలు శుక్రవారం ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో రవాణా - బ్యాంకింగ్‌ - టెలికం తదితర సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఈ బంద్ లో ఎంతో విషయం దాగిఉంది. తమ ముఖ్యమైన 12 డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని కార్మికులు రోడ్డెక్కారు. వాటిలో ప్రధానమైనవి అయిన రూ.18 వేల కనీస వేతనం, నెలకు రూ.3 వేల కనీస పెన్షన్‌, ధరల పెరుగుదలను అరికట్టడం, పీఎస్‌యూల ప్రైవేటీకరణ ఆపడం, సహజ వనరుల్ని కార్పొరేట్లకు దోచిపెట్టొద్దు, కార్మికులందరికీ ఒకేరకమైన సామాజిక భద్రత, గ్రాట్యుటీ పెంచాలి, పెట్రోల్‌పై పన్నులు ఎత్తివేయాలి - బోనస్‌ పై పరిమితి ఎత్తివేయాలి వంటివి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఈ డిమాండ్లలో చాలా వరకూ దేశం మొత్తం మీద అన్నివర్గాల ప్రజలకు అత్యంత అవసరమైనవి!
 
అయితే ఏడో వేతన సంఘంలో రూ.18 వేలుగా నిర్ధారించిన కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్న డిమాండ్‌ పై అధ్యయనానికి కేంద్రం ఒక ప్రత్యేక కమిటీ వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంతమేర సంతృప్తి చెందారు. అయితే ఈ వేతన సంఘంలోనే కేంద్రమే నిర్ణయించిన ప్రకారం రూ.18 వేలు కనీస వేతనం ఇతర కార్మికులకు ఇవ్వడానికి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపైనే కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 
Tags:    

Similar News