పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నెలకొంటున్న ఆందోళనల నేపథ్యంలో..భారతదేశంలోని పరిణామాలపై అందరి చూపు పడింది. పలు దేశాలు భారత్ వెళ్లవద్దని ఆర్డర్లు కూడా వేస్తున్న పరిస్థితి. అయితే, ఈ సమయంలోనే అమెరికా న్యూస్ - వరల్డ్ రిపోర్ట్ లు కలిసి వార్టన్ స్కూల్ ఆఫ్ అమెరికాతో కలిసి చేసిన సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2020లో నివాసం ఉండేందుకు అత్యంత సురక్షితమైన దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉందని ఆ సర్వే ద్వారా స్పష్టమైంది. అయితే చిన్నపిల్లల పెంపకం - మహిళల పరిస్థితి అనే విషయాల్లో మాత్రం భారత్ పై సర్వేలో పాల్గొన్న వారు పెదవి విరిచారు.
మనిషి జీవించేందుకు సురక్షితమైన ఆసియాదేశాల్లో ప్రపంచదేశాలతో పోలిస్తే భారతదేశం 25వ స్థానంలో ఉంది. 2019లో చేసిన సర్వేలో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు రెండు స్థానాలను మెరుగుపర్చుకోవడం విశేషం. భారత్ కంటే ముందు చైనా - సింగపూర్ - దక్షిణ కొరియా - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఉన్నాయి. అయితే, ఈ సర్వేలో మరిన్ని ఇబ్బందికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా అభివృద్ధిలో భారత్ కంటే తక్కువ స్థానంలో ఉన్న దేశాలు కూడా మన కంటే గొప్ప పనీతరు కనబరుస్తున్నాయి.
చిన్న పిల్లల పెంపకంలో భారత్ ప్రపంచదేశాలతో పోలిస్తే 59వ స్థానంలో నిలిచింది. అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కెన్యా - ఈజిప్ట్ దేశాలు పిల్లల పెంపకంలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండటం దురదృష్టకరం. మరోవైపు మహిళలకు సురక్షితమైన దేశాల జాబితాలో భారత్ 58వ ర్యాంకు సాధించింది. పశ్చిమాసియా దేశాలు అయిన యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు భారత్ కంటే ముందున్నాయి. పొరుగు దేశాలైన చైనా - శ్రీలంకలు కూడా మహిళల భద్రతా విషయంలో ముందున్నట్లు సర్వే స్పష్టం చేసింది. మర్డర్ రేట్ లో చాలా ముందుండే దక్షిణాఫ్రికా మాత్రం మహిళలకు సురక్షితమైన దేశాల్లో భారత్ కంటే 15 ర్యాంకులతో ముందుండటం విశేషం. అయితే, 2019తో ఇది 59వ ర్యాంక్‌లో ఉన్న భారత్ ఈ ఏడాది 58కి చేరింది. మొత్తంగా భారత్ పై మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ...దేశంలోని చిన్నారులు - మహిళల భద్రత విషయంలో మాత్రం మరిన్ని చర్యలు అవసరమని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.