వామ్మో.. ఓరినాయానో.. అన్నట్లుగా ఉంటుంది కొందరు నేతల మాటలు చూస్తుంటే. అరే.. తాము మాట్లాడే విషయానికి .. తాము చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చే నేతలు బోలెడుమంది కనిపిస్తూ ఉంటారు.ఆ కోవలోకే చెందుతారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. నోరు తెరిస్తే మైనార్టీల గురించి మాట్లాడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చే ఆయన.. తనకు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టే పాతబస్తీ ప్రజలకు ఇప్పటివరకూ ఆయనేం చేశారన్నది చూస్తే.. ఆయనకున్న ప్రేమాభిమానాలు ఎంతో ఇట్టే అర్థమైపోతాయి.
నోరు తెరిస్తే మైనార్టీల సంక్షేమం మీద మాట్లాడే ఆయన.. పాతబస్తీలో మౌలికసదుపాయాల్ని ఇప్పటికి ఎందుకు సమకూర్చనట్లు? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు జిగిరీ దోస్త్ అయిన ఆయన.. ప్రతి ఎన్నికల్లో తమ పార్టీని మాత్రమే గెలిపించే ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు? అంటే సమాధానం రానిపరిస్థితి.
అలాంటి పెద్ద మనిషి.. తాజాగా ఒక విచిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. అదేమంటే.. భారత అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను ఇప్పటివరకూ ఎంతమంది ముస్లింలు.. దళితులు.. ఆదివాసీలకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. మహరాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అసద్.. దళితుల ఐకాన్ బీఆర్ అంబేడ్కర్ కు ఇచ్చిన భారతరత్న పురస్కారం కూడా హృదయపూర్వకంగా ఇవ్వలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అంబేడ్కర్ కు భారతరత్న పురస్కారం ఇచ్చారని..ఆయన మండిపడ్డారు. అసద్ వాదన భలేగా ఉంది కదూ. పురస్కారం ఇచ్చినోళ్లకేమో మనస్ఫూర్తిగా ఇవ్వలేదని.. ఇవ్వని వారికేమో అస్సలు ఇవ్వలేదు చూశారా.. ఎంత చిన్నచూపు అంటూ మాట్లాడుతున్న అసద్ కు దేశం గర్వించే పురస్కారం గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న ఆయన్ను ఒక సూటి ప్రశ్న వేయాలన్న మాట పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ ఆ ప్రశ్న ఏమంటే.. నిత్యం ఏదో ఒక లాజిక్కును తెర మీదకు తెచ్చే ఆయన.. హైదరాబాద్ పాతనగరానికి సంబంధించి మజ్లిస్ కు కంచుకోట అయిన ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులుగా ముస్లింలను మాత్రమే ఎందుకు నిలబెడతారు? హిందూ అభ్యర్థులను ఎందుకు బరిలోకి దింపరు? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది. అర్థం లేనివాదనలు తెచ్చే ముందు గురివిందను గుర్తుకు తెచ్చుకుంటే మంచిది అసద్! అసద్ లాంటోళ్ల మాటలు చూస్తే.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు కోటా మాదిరి.. మాట్లాడటం సబబు కాదు. ఇప్పటికే రాజకీయ కోణంలో పురస్కారాలు ఇస్తున్నట్లుగా వస్తున్న విమర్శలతో భారతరత్నప్రతిష్ఠ మసకబారుతోంది. ఇలాంటివేళ.. అసద్ లాంటోళ్ల డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటే అంతే సంగతులన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.