విలీన వివాదం నిరసనలకు దారితీసింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరడం.. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ ఇవ్వడం జరిగిపోయింది. దీనిపై కాంగ్రెస్ మిగిలిన ఎమ్మెల్యేలు ధర్నాకు - నిరసనకు దిగారు.
తాజాగా టీఆర్ ఎస్ లో కాంగ్రెస్ సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. నోటికి నల్లగుడ్డలు కట్టుకొని తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వారు నినాదాలు చేశారు.
అంతకుముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేటీఆర్ ను కలిసి టీఆర్ ఎస్ లో చేరారు. మొత్తం 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేటీఆర్ లంచ్ కు ఆహ్వానించాడు. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఉండడంతో వారంతా స్పీకర్ ను కలిసి తాము టీఆర్ ఎస్ లో సీఎల్పీని విలీనం చేస్తున్నట్టు లేఖ ఇచ్చారు.
టీఆర్ ఎస్ ముందుగా స్కెచ్ గీసుకున్న ప్రకారం చకచకా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. కాగా దీనిపై కాంగ్రెస్ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం రాజ్యంగ విరుద్ధమని.. దీనిపై హైకోర్టులో తేల్చుకుంటామని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క్ తెలిపారు. జాతీయ కాంగ్రెస్ లేఖ ఇవ్వకుండా విలీనం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో ఈ విలీన వివాదం కొత్త మలుపు తిరిగింది.