నిజ‌మైన తుపాకి జోస్యం..భ‌ట్టికే పీఠం

Update: 2019-01-18 16:49 GMT
గాలి క‌బుర్ల‌కు దూరంగా ఉంటూ...విశ్వ‌స‌నీయ స‌మాచారంతో ప‌క్కాగా రాజ‌కీయ జోస్యం చెప్పే నంబ‌ర్‌ వ‌న్ వెబ్  సైట్‌`తుపాకి` జోస్యం మ‌రోమారు నిజ‌మైంది. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి విష‌యంలో `తుపాకి` అంచ‌నా క‌రెక్ట‌యింది. తెలంగాణ సీఎల్పీ నేతగా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు భట్టి విక్రమార్కను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంపిక చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఈ మేర‌కు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ విష‌యాన్ని తుపాకి ముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో కొత్త అసెంబ్లీ కొలువుదీరనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) స‌మావేశం జ‌రిగిన స‌మ‌యంలోనే కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా మల్లు భట్టివిక్రమార్కను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైందని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారాన్ని పేర్కొంటూ `తుపాకి` క‌థ‌నం వెలువ‌రించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌ లో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కోర్‌ కమిటీ సమావేశం నిర్వ‌హించి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు - సీనియర్ నేతల అభిప్రాయాలను అధిష్ఠానం తెలుసుకుంది. ఈ మేరకు సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పేర్కొంటూ ఆ నాయ‌కుడు భ‌ట్టి అని తెలిపింది.

కాగా, టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క - సబితా ఇంద్రరెడ్డి - శ్రీధర్‌ బాబు - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సీఎల్పీ పదవి ఆశిస్తున్న వారిలో ముఖ్యులుగా నిలిచారు. అయితే, భ‌ట్టికే ప‌ద‌వి క‌ట్టబెట్టాల‌ని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో స్ప‌ష్టత వ‌చ్చింది. దీంతో సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్టుగా గెహ్లాట్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Tags:    

Similar News