కీలక అంశాల మీద మాటలు చెప్పే నేతలు కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నది లేనట్లుగా మాట్లాడే వేళలో..కనీసం కనికట్టు చేసినట్లు అయినా ఉండాలి.
అందులో నిజం లేకున్నా.. అబద్ధమన్నట్లుగా ఉండకపోవటం అంతో ఇంతో లాభించేలా చేస్తుంది. అందుకు భిన్నంగా.. ఉన్నది కూడా లేనట్లుగా మాట్లాడటం వల్ల మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇదే రీతిలో ఉన్నాయి.
ఇప్పుడు కాంగ్రెస్ కు చెందిన నేతలు పలువురు బీజేపీలోకి చేరతారన్న ప్రచారం బలంగా సాగుతున్న వేళ.. తాను పార్టీ మారేది లేదని స్పస్టం చేశారు. కాంగ్రెస్ ను బలహీనపర్చటం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరూ ఆ ట్రాప్ లో పడకూడదన్న భట్టి... మునుగోడు విషయంలో మాత్రం ఆయన వ్యాఖ్యలు నిజానికి దూరంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని.. గతానికి మించి ఈసారి జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ రావటం ఖాయమన్నారు. అదే సమయంలో.. మునుగోడులో పోటీ మొత్తం అధికార టీఆర్ఎస్ తోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.
బీజేపీ బలపడుతున్న విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నారు. భట్టి మాటల్ని వింటున్న వారు బీజేపీ నేతలు మాత్రం కస్సుబుస్సుమంటున్నారు. దీనికి కారణం.. మునుగోడులో బీజేపీకి బలం పెరగటం.. రాజగోపాల్ రెడ్డి ఎంట్రీతో ఆయన అనుచరులు మొత్తం తమ పార్టీలోకి మారతారన్న మాటను చెబుతున్నారు.
అందుకు భిన్నంగా మునుగోడులో పోటీ మొత్తం రెండు పార్టీల మధ్యనే అన్నట్లు భట్టి మాటల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు. ఇక.. పార్టీ నుంచి జంప్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు ఇద్దరూ తమ నియోజకవర్గాల్లోని ప్రజల మధ్య పర్యటిస్తూ.. వారి సమస్యల్ని పరిష్కరిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. బలపడుతున్న బీజేపీని గుర్తించమని చెప్పటం భట్టి చేస్తున్న తప్పులుగా చెప్పక తప్పదు.