అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సమస్యలు తప్పేలా లేవు. హైదరాబాదులోని తన భూమిని అక్కడి కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని గగ్గోలు పెడుతున్న ఆమె వాదన నిలిచేలా కనిపించడం లేదు. శేరిలింగంపల్లి మండలంలలోని రాయదుర్గం పాన్ మక్తాలోని ముంబై హైవేకు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 83లోని 125.30 ఎకరల భూమికి సంబంధించిన వివాదంలో అరకు ఎంపి గీత భర్త నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్ర చేశారని, ఆ భూమిపై సర్వ హక్కులు భావన సహకార గృహ నిర్మాణ సొసైటీకే ఉన్నాయని ఆ సొసైటీ అధ్యక్షుడు పివిసి దాస్ - ఉపాధ్యక్షుడు లక్ష్మిప్రసాద్ - సభ్యులు జె. శ్రీనివాస్ లు తాజాగా ఆధారాలు చూపిస్తుండడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. భూమిపై ఎంపి కొత్తపల్లి గీత - ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఎలాంటి హక్కులు లేవని వారు చెబుతున్నారు.
ఎంపి భర్త సొసైటీ పేరిట నకిలీపత్రాలు సృష్టించి భూమి కాజేసేందుకు ప్రయత్నించారని వారు ఆరోపిస్తున్నారు. గీత భర్త ఎనిమిది కొత్త ప్రైవేటు లిమిటేడ్ సొసైటీలను సృష్టించి ఆ సొసైటీల్లో ఆయనే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ తీసుకుని 621 మంది సభ్యులకు చెందిన ఈ స్థలాన్ని పరిరక్షించి - తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.
కాగా ఆ భూమికి సంబంధించి కొద్దికాలంగా నలుగుతున్న వివాదంలో అన్ని వ్యవహారాలకు సంబంధించి సొసైటీ వద్ద ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కొత్తపల్లి గీత ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది అనుమానంగా మారింది. దీంతో ఆమెకు ఈ విషయంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
భావన సొసైటీ ఆరోపణలు
- 2008-09లో 64 ఎకరాల భూమిని ఎనిమిది సొసైటీలకు బదిలీ అయినట్లుగా నకిలీపత్రాలు సృష్టించారు.
- ఆ నకిలీ పత్రాలతో హైదరాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో ఈ భూమిని తాకట్టు పెట్టి రూ.42.72కోట్లు రుణంగా తీసుకున్నారు.
- బ్యాంకు అధికారుల తనిఖీలలో ఆ పత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో సిఐడి పోలీసులు 468 - 471 - 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- అదాయపుపన్ను శాఖ ఈ భూమిని విక్రయించేందుకు రూ. 42.79 కోట్ల ఒప్పందం చేసుకున్నందున పెట్టుబడి లాభాల కింద పన్ను చెల్లించాలని అసలు సొసైటీకి నోటీసు పంపింది. ఈ కేసు ఆదాయపుపన్ను శాఖలో పెండింగ్ లో ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/