ఈవెంట్ ఏదైనా ప్రమోషనే కీలకం. ఎంతగా ప్రమోట్ చేస్తే.. అంతగా సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. ఇదే మార్కెట్ సూత్రం. త్వరలో ఐపీఎల్-2021 సీజన్ మొదలు కాబోతోంది. దీంతో.. ఆయా ప్రాంచైజీలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నాయి. ప్రమోషన్ స్పీడు కూడా పెంచుతున్నాయి.
ఆ మధ్య ఐపీఎల్ ప్రారంభం గురించి స్టార్ స్పోర్ట్స్ ధోనీతో ఓ యాడ్ చేసిన విషయం తెలిసిందే. బౌద్ధ సన్యాసి రూపంలో గుండుతో కనిపించిన మహీ.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు ప్రమోషన్ స్పీడు పెంచింది. ఇందుకు టాలీవుడ్ హీరోలను ఉపయోగించుకుంటూ దూసుకెళ్తోంది.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను మార్ఫింగ్ చేసింది యాజమాన్యం. కత్తి పట్టుకొని పరిగెడుతున్న జూనియర్ బాడీకి.. మనీశ్ పాండే ఫేస్ తగిలించి, ఈ సీజన్లో మనీష్ ఎలా ఆడాలని కోరుకుంటుందో రాసుకొచ్చింది. ‘మనీష్ పాండే నుంచి ఏం కోరుకుంటామో మనందరికీ తెలిసిందే. నిర్ధాక్షిణ్యంతో కూడిన బ్యాటింగ్’ అని క్యాప్షన్ జత చేసింది.
ఇప్పుడు తాజాగా.. పేసర్ భువనేశ్వర్ ఫేస్ ను శ్రీమంతుడు సినిమాలోని మహేష్ బాడీతో ఎడిట్ చేసింది. దానికి ఆ చిత్రంలోని ఫేమస్ డైలాగ్ కూడా యాడ్ చేసింది. ‘‘హైదరాబాదీ ఫ్యాన్స్ నాకు చాలా ప్రేమను ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ రూపంలో తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతా.’’ అంటూ భువీ అన్నట్టుగా క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి సినిమా స్టార్లను ప్రమోషన్ కు బాగానే యూజ్ చేసుకుంటోంది సన్ రైజర్స్ టీమ్. అయితే.. ఏప్రిల్ 9న టోర్నీ ఆరంభం కానుండగా.. అదే రోజు పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్కాబోతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఫొటోను కూడా మార్ఫింగ్ చేస్తారనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు ఫ్యాన్స్.