అమెరికాలో భారత సంతతికి చెందిన వారు గతంలో ఎన్నో ప్రైవేట్ సంస్థల్లో పదవులు దక్కించుకున్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం పదవులు పొందింది లేదు.తొలి సారి భారత సంతతికి చెందిన మహిళ ఒక అత్యున్నత స్థానాన్ని దక్కించుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) చీఫ్‌గా భవ్య బాధ్యతలు చేపట్టారు.
అయితే భవ్య ప్రస్థానం ఏమిటో ఓ సారి తెలుసుకుందాం..
భవ్య నాసా బృందంలో గతంలో సభ్యురాలిగా పనిచేశారు. నాసా సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ సాంకేతిక విధానాల రూపకల్పనలోనూ భవ్య కీలకంగా వ్యవహరించారు.
అమెరికా స్పేస్ టెక్నాలజీ, స్ట్రాటజీ సలహాదారుగా పనిచేశారు. భవ్య లాల్‌కు ఇంజనీరింగ్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై ఎంతో అనుభవం ఉంది. అయితే ఆమె అమెరికా అధ్యక్షుడు బైడెన్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీమ్‌లో సభ్యురాలిగా పనిచేశారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీ, అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ పొందారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనా విభాగంలో సభ్యురాలిగా కొనసాగారు.
అనేక అంతరిక్ష పరిశోధనలు కొనసాగించారు. అయితే జో బైడెన్‌తో ఉన్న సత్సంబంధాల వల్లే ఆమెకు ఈ పదవి దక్కినట్టు సమాచారం. డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్‌గా, వైట్‌హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ స్పేస్ కౌన్సిల్ గెస్ట్ మెంబర్‌గా పనిచేశారు. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె సైన్స్‌లో మాస్టర్ డిగ్రీని సాధించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక పలువురు భారతీయులకు ఉన్నత పదవులు దక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత సంతతి మహిళ కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.