ఫేస్ బుక్ సీఈవోకు భార‌త కోర్టు స‌మ‌న్లు

Update: 2018-04-27 05:33 GMT
దిగ్గ‌జ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్ ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌ కు భోపాల్ జిల్లా కోర్టు తాజాగా స‌మ‌న్లు పంపింది. భోపాల్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ట్రేడ్ బుక్. ఆర్గ్ అనే స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌ప్నిల్ రాయ్ కంప్లైంట్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. జుక‌ర్ కు స‌మ‌న్లు పంపింది.

ఇంత‌కీ ఈ వివాదం ఏమిటి? అన్న‌ది చూస్తే.. స్వ‌ప్నిల్ రాయ్ అనే ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త ద ట్రేడ్ బుక్‌. ఆర్గ్ అనే స్టార్ట‌ప్ ను స్టార్ట్ చేశారు. త‌న పెయిడ్ యాడ్ ను ఫేస్ బుక్ లో ప్ర‌చురిస్తున్నారు. ఆయ‌న కంపెనీకి చెందిన యాడ్ ను మూడు రోజుల పాటు ప‌బ్లిష్ చేసిన ఫేస్ బుక్.. తాజాగా ఆయ‌న యాడ్ ను పబ్లిష్ చేయ‌టం మానేయ‌ట‌మేకాదు.. కంపెనీ టైటిల్ మీద అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ లీగ‌ల్ నోటీసులు పంపింది.

ద ట్రేడ్ బుక్ లోని బుక్ అనే ప‌దాన్ని తొల‌గించాలని కోరింది. దీనిపై స్వప్నిల్ తీవ్ర‌మైన అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌న వెబ్ పేజ్ మొద‌టిద‌శ ప్ర‌మోష‌న్స్ ను 2016 ఆగ‌స్టు 8 నుంచి 16 వ‌ర‌కు స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించామ‌ని.. రెండో ద‌శ‌ను 2018 ఏప్రిల్ 14 నుంచి 21 వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉండ‌గా.. మూడు రోజుల త‌ర్వాత త‌న యాడ్ ను ఫేస్ బుక్ ఆపేసింద‌న్నారు.

త‌న వెబ్ పేజీకి అధికారిక ట్రేడ్ మార్క్ ఉంద‌ని.. అలాంటప్పుడు త‌న ప్ర‌క‌ట‌న‌ను ఎందుకు ఆపాల్సి వ‌చ్చిందో చెప్పాలంటూ ఫేస్ బుక్ సీఈవోపై కోర్టులో ఫిర్యాదు చేశారు. స్వ‌ప్నిల్ కంప్లైంట్ మీద విచార‌ణ జ‌రిపిన భోపాల్ జిల్లా కోర్టు జుక‌ర్ కు స‌మ‌న్లు పంపింది.  మ‌రి.. దీనికి ఫేస్ బుక్ సీఈవో ఎలా రియాక్ట్ అవుతారో?


Tags:    

Similar News