కరోనా వైరస్ ..ఈ మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తూపోతుంది. దేశంలో క్రమక్రమంగా కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూపోతుంది. అయితే, ఇప్పుడు కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో కరోనా మహమ్మారి మరణమృదంగం వాయిస్తుంది. భోపాల్ విష వాయువు ఘటన బాధితులు 12 మందిని.. కరోనా మహమ్మారి కాటేసింది. వీరంతా కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు.
భోపాల్ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు విడుదలైన సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ దుర్ఘటన నుండి కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ వారిని ఇప్పుడు కరోనా మహమ్మారి కాటువేసింది. మొత్తం పన్నెండు మంది గ్యాస్ బాధితులు కరోనాతో మరణించినట్లు అధికారులు తెలిపారు.
భోపాల్ నగరంలోని హమీదియా గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన రోగులను పరీక్షించగా వారంతా కరోనా ప్రభావంతోనే మరణించినట్లు తేలింది. అయితే ఇలా ఒక్కక్కరుగా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం వెంటనే చర్యలకు తీసుకోవడం మొదలుపెట్టింది. గ్యాస్ బాధితులు ఉంటున్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.