మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రైవేట్ హాస్టల్ నడిపే నిర్వాహకుడు హాస్టల్ లోని ఇద్దరు ఆడపిల్లలు - ముగ్గురు అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై ఆ హాస్టల్ లోని చెవిటి అంధ విద్యార్థులు మీడియా ఎదుట వాపోయారు. హాస్టల్ ఓనర్ తమపై అత్యాచారం చేశాడని.. అసహజ రీతిలో తమను లైంగికంగా వేధించాడని వారు బోరుమన్నారు. అధికారులు - పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆ విద్యార్థులు ఏకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ రాష్ట్ర మీడియా సెల్ చీఫ్ శోభ ఓజా ప్రెస్ మీట్ పెట్టి మరీ హాస్టల్ ఓనర్ అత్యాచార ఘటనను మీడియా ఎదుట వివరించారు.
భోపాల్ లోని బైరాఘర్ బ్రాంచిలో ఉంటున్న ఈ హాస్టల్ డైరెక్టర్ గతేడాది కూడా అత్యాచారం చేశాడని.. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని శోభ మండిపడ్డారు. తాజాగా కూడా ఇదే పనిచేయడంతో హాస్టల్ లోని 40 మంది వచ్చి కాంగ్రెస్ నేతలతో మొరపెట్టుకున్నారు. వారి బాధను విన్న కాంగ్రెస్ నేతలు ఏకంగా మీడియా ఎదుట విద్యార్థులతో చెప్పించారు. బాధితులు 2017 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదని శోభ వివరించారు.
బాధితులతో కలిసి కాంగ్రెస్ నేతలు సామాజిక న్యాయశాఖ వద్ద ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీనగర్ పోలీస్టేషన్ కు చేరుకొని అక్కడ కూడా ఫిర్యాదు చేశారు. ఈ వార్త మీడియాలో దుమారం రేగడంతో విచారణ ప్రారంభిస్తున్నట్టు స్వయంగా డీజీపీ ధర్మేంద్ర చౌదరి తెలిపారు.