క‌ర్నూలు టీడీపీ 'ఆమె' దేనా? సీనియ‌ర్లు మౌనం!

Update: 2020-12-28 03:45 GMT
క‌ర్నూలు జిల్లా టీడీపీని నిల‌బెట్టేవారు ఎవ‌రూ లేరా?  కేవ‌లం మాజీ మంత్రి అఖిల ప్రియ మాత్ర‌మే దూకుడు గా ఉండ‌డం వెనుక రీజనేంటి?  పార్టీ ఓడినంత మాత్రాన‌.. నేత‌ల దూకుడుకు బ్రేకులు ప‌డాలా? వ‌ంటి అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ జిల్లాలో పార్టీకి కీల‌క సార‌థ్యం వ‌హించిన సీనియ‌ర్ నాయ‌కులు చాలా మంది ఉన్నారు. కేఈ కుటుంబం నుంచి కోట్ల ఫ్యామిలీ వ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు తెచ్చుకుని పోటీ చేశారు. ఓడిపోయారా?  గెలిచారా? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. వీరంతా కూడా పార్టీలో కీల‌కంగా ఉన్నారు. అదేస‌మ‌యంలో యువ నాయ‌క‌త్వం కూడా మెండుగానే ఉంది. కానీ.. ఇప్పుడు టీడీపీ త‌ర‌ఫున జెండా ప‌ట్టుకునేనాయ‌కుడు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు..

అయితే.. ఒక్క మ‌హిళా నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ మాత్రం ప్ర‌తి రోజూ ఏదో ఒక కార్య‌క్ర‌మం పెట్టుకుని ముందుకు వ‌స్తున్నారు. మీడియాలో ఉంటున్నారు. పోనీ.. ఆమెతో అయినా క‌లిసి మిగిలిన నేత‌లు అడుగులు వేస్తున్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.  డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి.. ఆయ‌న సోద‌రుడు కేఈ ప్ర‌భాక‌ర్‌(ప్ర‌స్తుత ఎమ్మెల్సీ).. వంటి వారు అధికారంలో ఉండ‌గా చ‌క్రం తిప్పారు. నంద్యాల పార్ల‌మెంటు ప‌రిధిలోను, క‌ర్నూలు పార్ల మెంటు ప‌రిధిలోనూ అనేక మంది గ‌తంలో అధికారంలో ఉండ‌గా ప‌ద‌వులు చేజిక్కించుకున్న‌వారు చాలా మంది ఉన్నారు. కానీ, ఇప్పుడు పార్టీకి అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మాత్రం ముఖం చాటేస్తున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో మాజీ మంత్రి అఖిల దూకుడుగా ఉన్న నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌లో మాత్రం పార్టీ స్వింగ్ ‌లో ఉంద‌నే చెప్పాలి. ప్ర‌ధానంగా బ్ర‌హ్మానంద‌రెడ్డి - అఖిల ‌ప్రియ నిత్యం పార్టీ కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తున్నారు. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. పార్టీ ప‌రిస్థితి దారుణంగానే ఉంది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం లో చ‌క్రం తిప్పిన నాయ‌కులు.. ఇప్పుడు పార్టీ ప్ర‌తిప‌క్షంలోకి రావ‌డంతో కాడి ప‌డేశారానే వాదన బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోక పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు పిలుపు ఇస్తున్నా.. ఏ కార్య‌క్ర‌మానికీ హాజ‌రు కావ‌డం లేదు.

 పైగా.. వైసీపీతోనూ లోపాయికారిగా క‌లిసి మెలిసి ప‌నిచేస్తున్నవారు కూడా ఉన్న‌ట్టు తెలుస్తొంది.  ఈ ప‌రిణామాల‌తో జిల్లా వ్యాప్తంగా వైసీపీ దూకుడు పెరిగింది. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. ఓడిపోయినంత మాత్రాన ఇంటికే ప‌రిమితం కావ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేసుల భ‌యంతోనో.. దాడుల భ‌యంతోనో ఇంటికే ప‌రిమిత‌మైతే.. ఇక‌, రాజ‌కీయాలు ఎందుక‌నే ప్ర‌శ్న టీడీపీ సానుబూతి ప‌రుల నుంచి జోరుగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి సీనియ‌ర్లు ఇప్ప‌టికైనా ముందుకు వ‌స్తారా?  పార్టీని బ‌లోపేతం చేస్తారా?  చూడాలి.

    

Tags:    

Similar News