కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత - వైసీపీ టికెట్ పై నంద్యాల నుంచి విజయం సాధించిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. భూమా రీ ఎంట్రీతో అప్పటికే టీడీపీలో చేరిపోయిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి తీవ్ర ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే అయినా... భూమా మరణంతో అక్కడి ఉప ఎన్నికలో తానే పోటీ చేస్తానని, 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున తానే పోటీ చేసినందున ఉప ఎన్నికలో పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని శిల్పా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే పార్టీలో కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం ప్రకారం... చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే ఆ టికెట్ ను ఇవ్వాల్సి ఉందన్న వాదన వినిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు... శిల్పాకు కాస్తంత గట్టి షాక్ నే ఇచ్చేశారు. అయితే టీడీపీ టికెట్ లభించకున్నా... తాను పోటీ చేస్తానని, అవసరమైతే వైసీపీలోకి వెళ్లేందుకు కూడా వెనుకాడబోనని శిల్పా ప్రకటించి అక్కడ హైటెన్షన్ వాతావరణానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలన్న కోణంలో తర్జనభర్జన పడ్డ చంద్రబాబు చివరకు శిల్పాతో సామరస్యపూర్వక చర్చలకే ఓకే అన్నట్టుగా నేటి ఉదయం వార్తలు వినిపించాయి.
అయితే ఇదే తరుణంలో తండ్రి మరణంతో పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర నిర్వేదంలో ఉన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే - ఇటీవలే చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భూమా అఖిలప్రియ కాసేపటి క్రితం ఈ హీట్ ను మరింతగా పెంచేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరఫున తన కుటుంబ సభ్యులే బరిలోకి దిగుతారని ఆమె ప్రకటించారు. నేటి మధ్యాహ్నం విజయవాడలోని భవానీ ద్వీపం పర్యటనకు వెళ్లిన అఖిల... అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
నంద్యాల బరిలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని చెప్పిన అఖిల... అభ్యర్థి విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, .ఈనెల 24న తన తల్లి శోభానాగిరెడ్డి వర్దంతి రోజున అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తామన్నారు. అయితే ఈ ప్రకటనను అఖిల... చంద్రబాబు నుంచి అనుమతి తీసుకునే చేశారా? లేక తన మనసులోని భావనను చెప్పారా అన్న విషయం తెలియరాలేదు. ఓ వైపు శిల్పాను దారికి తెచ్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న తరుణంలో అఖిల నోట నుంచి ఈ ప్రకటన రావడం టీడీపీ వర్గాలను షాక్ కు గురి చేసిందనే వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/