జేజ‌మ్మ‌గా అఖిల‌!...బాబుకు ఎర్తేనా?

Update: 2017-08-28 10:08 GMT
నంద్యాలకు చెందిన మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డిని ఇప్పుడు టీడీపీ త‌మ్ముళ్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నంద్యాల‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం కోసం అఖిల అలుపెర‌గ‌కుండా కృషి చేశార‌ని త‌మ్ముళ్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక్క‌డ వ‌చ్చిన ఉప పోరులో ఆమె త‌న సోదురుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇప్పించుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి అన్నీతానై చంద్ర‌బాబుతో మాట్లాడి ద‌గ్గ‌రుండి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. దీనిని సీరియ‌స్‌గా కూడా తీసుకున్నారు. త‌న తండ్రి - త‌ల్లి సెంటిమెంట్‌ ను బ‌లంగా జ‌నాల్లోకి తీసుకువెళ్లడంలోనూ ఆమె త‌న దైన శైలితో దూసుకుపోయింది.

ఇక‌, సోమ‌వారం నంద్యాల ఉప పోరు ఫ‌లితాలు విడుద‌ల అవుతున్న క్ర‌మం నుంచే బ్ర‌హ్మానంద‌రెడ్డి ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చాడు. ఎక్క‌డా డీలా ప‌డ‌కుండా ఆ టెంపో కొన‌సాగించాడు. దీంతో గెలుపు ప‌క్క‌న పెట్టి.. భారీ మెజారిటీ సాధించే దిశ‌గా దూసుకుపోయాడు. దీంతో నంద్యాల టీడీపీ అభిమానులు - నేత‌లు.. కూడా ఇప్పుడు బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం వెనుక అఖిల ప్రియ ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అంత‌టితో ఆగ‌కుండా అనుష్క హిట్ మూవీ అరుంధ‌తిలోని పాత్ర జేజ‌మ్మ‌తో అఖిల ప్రియ‌ను కంపేర్ చేస్తూ.. పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

నంద్యాల జేజ‌మ్మ టైటిల్ తో వెల‌సిన ఓ పోస్ట‌ర్‌ కు * ఇక్క‌డ ఏ ప‌శుప‌తి ఆట‌లూ సాగ‌వు!* అనే స‌బ్ టైటిల్ జోడించేసి.. అనుష్క ప్లేస్‌ లో అఖిల ఫొటో పెట్టి పెద్ద ఎత్తున పండ‌గ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ఫొటో భారీ ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మొత్తానికి అఖిల ప్రియకి ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇదిలా ఉంటే, విమ‌ర్శ‌కులు మాత్రం.. నంద్యాల‌లో గెలుపు మొత్తం అఖిల ప్రియ త‌న ఖాతాలోకే వేసుకుని.. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని, ఇదే ట్రెండ్ కొన‌సాగితే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆమె భ‌విష్య‌త్తులో క‌రివేపాకు మాదిరిగా ప‌రిగ‌ణించినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News