బాబుకు ఝ‌ల‌క్ ఇచ్చిన అఖిల ప్రియ‌

Update: 2018-04-25 13:20 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మంత్రి అఖిల‌ప్రియ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. వివాదాలు స‌ద్దుమ‌ణిగేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న స‌మ‌యంలోనే...సాక్షాత్తు ముఖ్య‌మంత్రి ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఆమె డుమ్మా కొట్టారు. పార్టీ నేత‌లు అఖిల‌ప్రియ‌ - సుబ్బారెడ్డి ఆళ్ల‌గ‌డ్డ‌లో పోటాపోటీ సైకిల్ యాత్ర‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో శిరివెల్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట దగ్గర ఏవీ సుబ్బారెడ్డిపై ప్రత్యర్థులు రాళ్లదాడి చేశారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అఖిలప్రియ వర్గీయులే దాడి చేశారని సుబ్బారెడ్డి ఆరోపించారు. దాడి ఘటనపై సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ప‌రిణామం అనంత‌రం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘‘35 ఏళ్లు భూమా నాగిరెడ్డికి ప్రాణంలో ప్రాణంగా ఉన్నాను. భూమా కుటుంబానికి నా ప్రాణాలొడ్డాను. ఫ్యాక్షన్ గొడవల్లో నా వర్గీయులు కూడా చనిపోయారు. వాళ్ల కుటుంబం కోసం ఇంత చేస్తే నాపైనే దాడి చేశారు. దాడితో విస్మయానికి గురయ్యాను. మే ఇద్దరం ఓకే పార్టీలో ఉన్నాము కాబట్టి... పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మౌనంగా ఉంటున్నా. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే... నేనేంటో మాటల్లో కాదు... చేతల్లో చూపిస్తాను’’ అని హెచ్చ‌రించిన నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు స‌మ‌స్య ప‌రిష్కారానికి స‌మావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన స‌మాచారం బుధ‌వారం నిర్వ‌హించేందుకు బాబు సిద్ద‌మ‌య్యారు.

అయితే ఈ భేటీకి మంత్రి భూమా అఖిల‌ప్రియ డుమ్మా కొట్టారు. ముఖ్య‌మంత్రితో స‌మావేశం అనే నేప‌థ్యంలో పార్టీ సీనియ‌ర్ నేత సుబ్బారెడ్డి రాజ‌ధాని అమరావ‌తికి చేరుకున్నారు. అయితే అఖిల‌ప్రియ మాత్రం ఆళ్ల‌గ‌డ్డ‌లోనే ఉండిపోయారు. ఈ విష‌య‌మై మీడియా ప్ర‌స్తావించ‌గా...త‌న‌కెలాంటి స‌మాచారం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, గత కొంత కాలంగా మంత్రి అఖిల ప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అఖిలప్రియ దూకుడు సుబ్బారెడ్డికి ఇబ్బందిగా మారడం..తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంతో ఆయన ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News