ఏపీ మంత్రి అఖిలప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన ఒకటి బయటకు వచ్చింది. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలన్న ఒక యువకుడి చావు తెలివితేటలు అతన్ని అడ్డంగా దొరికేలా చేయటమే కాదు.. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేలా చేశాయి.
గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తి ఉద్యోగం కోసం మంత్రి అఖిలప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. మంత్రి అఖిల సంతకాన్ని ఫోర్జరీ చేసిన అతగాడు.. ఆ పత్రాన్ని ఏకంగా మంత్రికే ఇచ్చారు. తాను సంతకం పెట్టినట్లుగా ఉన్న బోగస్ సిఫార్సు లేఖను మంత్రి గుర్తించారు. వెంటనే..మంత్రి పేషీ సిబ్బందికి తెలియజేయటంతో వారు ఎస్పీకి కంప్లైంట్ చేశారు.
కేసు నమోదు చేసిన అధికారులు అలీని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ పలువురు ఎమ్మెల్యేల సంతకాల్ని అలీ ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది.