మామ‌తో జ‌న‌రేష‌న్ గ్యాప్ ఏంది అఖిల‌?

Update: 2017-06-17 04:42 GMT
చిన్న వ‌య‌సులో వ‌చ్చి ప‌డ్డ పెద్ద బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించాల్సి రావ‌టం అగ్నిప‌రీక్షే. ఏ మాత్రం తేడా జ‌రిగినా.. మొత్తం మునిగిపోవ‌టం ఖాయం. భారీ క్యాడ‌ర్‌.. నేత‌ల‌తో ఉండే భూమా పొలిటిక‌ల్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకోవ‌టం మామూలు విష‌యం కాదు. అందునా.. క‌ర్నూలు జిల్లా లాంటి టిపిక‌ల్ రాజ‌కీయాల్ని వంట బ‌ట్టించుకోవ‌టం అంత సులువైనది కాదు. ఊహించ‌ని రీతిలో తండ్రిని పోగొట్టుకొని.. అధినేత అండ‌తో చిన్న వ‌య‌సులోనే మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన అఖిల ప్రియ‌కు స‌వాళ్ల మీద స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.

తండ్రికి కుడి భుజంగా వ్య‌వ‌హ‌రించిన ఏవీ సుబ్బారెడ్డి లాంటి నేత‌తో అఖిల విభేదాలు తెచ్చుకునే వ‌ర‌కూ వెళ్ల‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నంద్యాల మీద ప‌ట్టు బిగించే విష‌యంలో ప‌ట్టుద‌ల‌తో ఉన్న అఖిల‌.. ఉప ఎన్నిక‌లో త‌న తండ్రి స్థానాన్ని త‌న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గానికి వెళ్ల‌కుండా చేసుకోవ‌టంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. చంద్ర‌బాబు అండే దీనికి కార‌ణంగా చెప్పొచ్చు.

కానీ.. ఇంటి మ‌నిషిగా ఉండే సుబ్బారెడ్డి లాంటి వారిని దూరం చేసుకోవ‌టం ఏమాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని అఖిల‌ప్రియ మ‌ర్చిపోకూడ‌దు. తన‌కు జ‌గ‌న్ పార్టీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించిన సుబ్బారెడ్డి సంచ‌ల‌నంగా సృష్టించారు. దీనిపై తాజాగా అఖిల‌ప్రియ కూడా స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డి త‌మ ఇంటి మ‌నిషి అని.. తాను మామా అని పిలిచే చ‌నువు ఉంద‌న్నారు.

త‌మ మ‌ధ్యనున్న విభేదాల్ని ప‌రిష్క‌రించుకోవ‌టానికి సిద్ధంగా ఉన్నాన‌ని.. త‌న‌కు ఆ చ‌నువు ఉంద‌న్నారు. త‌న వైపు నుంచి ఏదైనా పొర‌పాటు జ‌రిగి ఉంటే దాన్ని దిద్దుకుంటాన‌ని చెప్పిన అఖిల‌.. తాను కుటుంబంలోని వారిని దూరం చేసుకునే ప‌రిస్థితుల్లో లేన‌న్నారు.

ఏదైనా ఉంటే ప‌రిష్క‌రించుకుంటామ‌ని చెప్పిన అఖిల‌.. ఇలాంటి అసంతృప్తుల్ని మొగ్గ‌లోనే ఎందుకు తుంచ‌లేద‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా.. త‌న‌కు తానుగా ఎవీ సుబ్బారెడ్డి బ‌ర‌స్ట్ అయ్యే వ‌ర‌కూ అఖిల ప్రియ ఎందుకు వెయిట్ చేసిన‌ట్లు? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. మామా అని పిలిచేంత చ‌నువు ఉంటే.. అలాంటి వారి మ‌న‌సు నొప్పించేలా అఖిల ప్రియ ఎందుకు వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి అఖిల ప్రియ ఏం చెబుతారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News