తండ్రి మరణం తరువాత తప్పనిసరి కోటాలో ఏపీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డకు పరిమితం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని.. అయితే, ఆ సంగతి పసిగట్టిన ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి నియోజకవర్గం నంద్యాలను వదులుకునేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఆదిలోనే అలాంటి ఆలోచనకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆమె ఓపెన్ అవుతున్నారని చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఆమె నంద్యాల కూడా తమ కుటంబానికే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల సీటును వదులుకునేది లేదని భూమా అనుచర వర్గం చెబుతోంది. భూమా చిన్న కూతురు అక్కడి నుంచి పోటీ చేస్తుందా? లేక భూమా అన్నకొడుకు అక్కడ నుంచి పోటీ చేస్తాడా అనేది తర్వాతి ప్రశ్న అని.. ఎవరైనా సరే భూమా కుటుంబం నుంచే అక్కడ గెలవాలని అంటున్నారు.
అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వకపోతే మాట పడతామన్న ఉద్దేశంతో చంద్రబాబు ఆమెకు పదవి ఇచ్చినా ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలు కట్టబెట్టారు. నిజానికి యంగ్ పొలిటీషియన్ కాబట్టి మంచి శాఖలు ఇస్తే పట్టు పెంచుకుంటూ డెవలప్ చేసే అవకాశం ఉండేదని ఆమె అనుచరవర్గం అంటోంది. అయితే.. పదవి ఇచ్చాం కాబట్టి నంద్యాల విషయంలో అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. దీంతో వేరే ఎవరికైనా టిక్కెట్ ఇచ్చినా ఇవ్వొచ్చన్న వాదన అప్పుడే మొదలైంది. ఆ ప్రచారాన్ని ఆదిలోనే తుంచేసి చంద్రబాబుకు సరైన సంకేతాలు పంపాలన్న ఉద్దేశంతో ఆమె నంద్యాల మాదే అంటున్నారని టాక్. అవసరమైతే తన పెదనాన్న కొడుక్కైనా టిక్కెట్ ఇప్పించుకుని గెలిపించాలన్నది ఆమె యోచనగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/